అనకాపల్లి: హోం మంత్రి అనిత సొంత మండలంలో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. నక్కపల్లి మండలంలో వైఎస్సార్‌సీపీ గెలిచింది. పెద్ద బోది గల్లం సర్పంచ్‌గా వైఎస్సార్‌సీపీ మద్దతున్న అభ్యర్థి విజయం సాధించారు. అలాగే.. రాంబిల్లి మండలం, రాజాల గ్రామ సర్పంచ్‌గా వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి సర్పంచ్‌గా వైఎస్సార్‌సీపీ మద్దతుదారు విజయం సాధించారు.
కాగా, రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ టీడీపీ దైర్జన్యాలు కొనసాగుతున్నాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు కలకలం రేపారు. చంద్రగిరి సాక్షి పత్రిక రిపోర్టర్ నరేష్ కుమార్ రెడ్డిపై టీడీపీ గుండాలు దాడి చేశారు. సెల్ ఫోన్ లాక్కొని నరేష్ కుమార్ రెడ్డిపై దాడి చేశారు టీడీపీ గుండాలు. పోలీసుల సమక్షంలోనే దాడి చేయడం గమనార్హం.
చంద్రగిరి నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ గుండాలు అరాచకాలు కొనసాగాయి. ముండ్లపూడిలో వైఎస‍్సార్‌సీపీ నేత సూరి తల్లి కోమలమ్మపై టీడీపీ గూండాలు దాడి చేశారు. కోమలమ్మ తలకు తీవ్రగాయాలై, ఏడు కుట్లు పడ్డాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోమలమ్మను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరామర్శించారు.
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం కృష్ణగిరి గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌ను అడ్డుకుంది టీడీపీ. బనగానపల్లె సీఐ వచ్చేవరకు కౌంటింగ్ పక్రియ మొదలు పెట్టకూడదు అంటూ కౌంటింగ్ పక్రియను అడ్డుకున్నారు. టీడీపీ నాయకులకు తలొగ్గి కౌంటింగ్ మొదలు పెట్టకుండా సీఐ కోసం అధికారులు వేచిచూశారు.
కోవెలకుంట్ల పోలింగ్ కేంద్రాలలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పీఏ హరి హల్‌చల్ చేశారు. అధికారులను పీఏ హరి ప్రభావితం చేస్తున్నారు. పోలింగ్ బూత్‌లలో దొంగ ఓట్లను వేయించారు హరి. పోలింగ్ బూత్‌లలో గుంపులు గుంపులుగా పోయి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు టీడీపీ నాయకులు. రిగ్గింగ్‌కు అడ్డుకునేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నాయకులను అడుగడుగున పోలీసులు అడ్డుపడ్డారు. పోలీసుల తీరుపై బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మండిపడ్డారు.


