జమ్మలమడుగులో కూటమికి షాక్‌ | TDP Leaders Join YSRCP in Pulivendula | Sakshi
Sakshi News home page

జమ్మలమడుగులో కూటమికి షాక్‌

Nov 29 2026 11:48 AM | Updated on Nov 29 2026 11:49 AM

TDP Leaders Join YSRCP in Pulivendula

పులివెందుల: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జమ్మలమడుగు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వానికి షాక్‌ తగిలింది. మైలవరానికి చెందిన ఆ పార్టీ నాయకులు బాబాయ్, అబ్బాయిలకు ఝలక్‌ ఇచ్చారు. మైలవరం గ్రామానికి చెందిన కూటమి నేతలు బెస్త శ్రీను, రాముడు, మునేష్ కృష్ణ, రమణ, ఆంజనేయులు, మాజీ సర్పంచ్‌ సుబ్బయ్య, మునిస్వామి, మారెన్న, నాగేంద్ర తదితర 70కుటుంబాలకు చెందిన వారు శనివారం వైఎస్సార్‌సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, ఎస్‌ఈసీ మెంబర్‌ గిరిధర్‌రెడ్డి సమక్షంలో ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. 

శనివారం ఉదయం పులివెందులలోని భాకరాపురంలోని తన స్వగృహం వద్ద వారికి ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి వైఎస్సార్‌సీపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ మైలవరం మండలంలో జరిగే పంచాయతీ ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని, అలాగే రాబోయే సార్వత్రిక ఎన్నికలలో జమ్మలమడుగు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగుర వేసేందుకు గట్టిగా కృషి చేయాలని వారిని కోరారు.

 ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ దాదాపు 20ఏళ్లుగా దేవగుడి కుటుంబానికి అండగా ఉన్నామని, ప్రస్తుతం వారు చేస్తున్న అనైతిక రాజకీయాలు, ప్రజా వ్యతిరేక పోకడలు, నియంతృత్వ దోరణిని చూడలేక ఆ పార్టీ నుంచి బయటకు వచ్చామన్నారు. రాబోయే కాలంలో జమ్మలమడుగు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ పటిష్టతకు కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు హనుమంతురెడ్డి, రుషికేశ్వరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement