దోపిడీ శాస్త్రంలో చంద్రబాబు డబుల్‌ పీహెచ్‌డీ | YSRCP leader and former minister Ambati Rambabu fires on Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

దోపిడీ శాస్త్రంలో చంద్రబాబు డబుల్‌ పీహెచ్‌డీ

Nov 29 2026 3:31 AM | Updated on Nov 29 2026 3:31 AM

YSRCP leader and former minister Ambati Rambabu fires on Chandrababu Naidu

అమరావతి నిర్మాణంలో ప్రపంచంలో ఎక్కడా లేని దోపిడీ

2014లో రూ.2,271 కోట్ల అంచనాతో సెక్రటేరియట్‌ భవనాల నిర్మాణం ప్రారంభం

ఇప్పుడు అంచనాలను ఏకంగా రూ.15,313 కోట్లకు పెంచేశారు

చ.అ.కు రూ. 30 వేలు వెచ్చిస్తూ చంద్రబాబు కిక్‌బ్యాక్స్‌ తీసుకుంటున్నారు

దోచుకున్న సొమ్ముని తండ్రీ కొడుకులు హైదరాబాద్, సింగపూర్‌ తరలిస్తున్నారు

రాజధాని పేరుతో వేల కోట్లు అప్పులు తెస్తూ ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతున్నారు

వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వనరులను ఎలా దోచుకోవాలనే ’దోపిడీ శాస్త్రం’లో ముఖ్యమంత్రి చంద్రబాబు డబుల్‌ పీహెచ్‌డీ చేశారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆయన శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. 2014లో రూ.2,271 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన సెక్రటేరియట్‌ భవనాల అంచనాలను నేడు ఏకంగా రూ.15,313 కోట్లకు పెంచి ప్రపంచంలోనే ఎక్కడా లేని దోపిడీకి పాల్పడుతున్నారని చెప్పారు. ఇసుక ఫ్రీ అంటున్నారని, సిమెంట్, ఐరన్‌ ధరలు ఏమీ పెరగలేదని, అయినా చదరపు అడుగుకు రూ.30 వేలు వెచ్చిస్తూ కిక్‌ బ్యాక్స్‌ తీసుకుంటున్నారని అన్నారు. 

తమిళనాడులో విజయ్‌ రూ.1,200 కోట్లతోనే సెక్రటేరియట్‌ నిర్మించాలని చూస్తుంటే, ఇక్కడ మాత్రం ఐదు భవనాలకు రూ.15 వేల కోట్లు దోచుకుని తండ్రీ కొడుకులు ఆ సొమ్ము బ్యాగుల్లో సర్దుకుని హైదరాబాద్, సింగపూర్‌ తరలిస్తున్నారని అన్నారు. ప్రతి వంద రోజులకి అమరావతి రూపు రేఖలు మారిపోతున్నాయని లోకేశ్‌ ట్వీట్‌ చేశారని, నిజానికి మారుతున్నది బిల్లులు పెంచి కమీషన్లు కొట్టేస్తున్న ఆయన ఆస్తుల రూపు రేఖలేనని చెప్పారు. పోలవరం తరహాలోనే అమరావతిని కూడా చంద్రబాబు తనకు, తన కుటుంబానికి, అనుయాయులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించుకునే వేదికగా మార్చుకున్నారని చెప్పారు. 

రాజధాని పేరుతో వేల కోట్ల రూపాయలు అప్పులు తెస్తూ ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతున్నారని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా అభ్యర్థులను అడ్డుకోవడం, దాడులు, అక్రమాలు, కౌంటింగ్‌లో కరెంట్‌ తీసేసి కట్టలు మార్చడం వంటి ఎన్నెన్నో దౌర్జన్యాలు చేశారని చెప్పారు.  అయినా 50 శాతం స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలుచుకుందని, ఎన్నికలను స్వేచ్ఛగా జరిపి ఉంటే టీడీపీకన్నా ఎక్కువ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించేవారని చెప్పారు.

రుషికొండ భవనాలపై తప్పుడు ప్రచారం
విశాఖపట్నంలో కేంద్ర అనుమతులతో టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.451 కోట్లతో అత్యుత్తమంగా నిర్మించిన ప్రభుత్వ భవనాల్ని ’జగన్‌ ఇల్లు’ అని రెండున్నరేళ్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వాటిని ఉపయోగంలోకి తేకుండా, నిర్వహణకు మాత్రం నెలకు పాతిక లక్షలు ఖర్చు పెడుతున్నారని తెలిపారు. విశాఖ నగరంలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, విదేశీ అతిథులు బస చేసేందుకు వైఎస్‌ జగన్‌ హయాంలో అత్యంత నాణ్యతతో నిర్మించిన ప్రభుత్వ భవనాల్ని సద్వినియోగం చేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement