జెడ్పీ పీఠాన్ని బాబు, లోకేశ్‌ రూ.30 కోట్లకు అమ్ముకున్నారు | BJP leader and former Kamalapuram MLA Veera Siva Reddy fires on chandrababu naidu | Sakshi
Sakshi News home page

జెడ్పీ పీఠాన్ని బాబు, లోకేశ్‌ రూ.30 కోట్లకు అమ్ముకున్నారు

Nov 29 2026 3:04 AM | Updated on Nov 29 2026 3:04 AM

BJP leader and former Kamalapuram MLA Veera Siva Reddy fires on chandrababu naidu

వారిద్దరికీ డబ్బే ముఖ్యం.. డబ్బున్న వారికే టీడీపీలో పదవులు వస్తాయి 

వైఎస్సార్‌ కడప జెడ్పీ చైర్మన్‌ పుత్తా నరసింహారెడ్డి ఓ హంతకుడు, స్మగ్లర్‌ 

పుత్తా తన స్వగ్రామం చుట్టుపక్కల 500 ఎకరాల భూమిని కాజేశారు 

బీజేపీ నేత, కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి 

కమలాపురం:  వైఎస్సార్‌ కడప జిల్లా జెడ్పీ చైర్మన్‌ పదవిని సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ రూ.30 కోట్లకు అమ్ముకున్నారని బీజేపీ నేత, కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి చెప్పారు. వారిద్దరికీ డబ్బే ముఖ్యమన్నారు. టీడీపీలో డబ్బు ఉన్న వారికే పదవులు వస్తాయని తెలిపారు. శనివారం వైఎస్సార్‌ కడప జిల్లా కోగటంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. జెడ్పీ చైర్మన్‌ వంటి పెద్ద పదవిని ఒక హంతకుడు, స్మగ్లర్‌ అయిన పుత్తా నరసింహారెడ్డికి ఇచ్చారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పుత్తా నరసింహారెడ్డి తన స్వగ్రామం చుట్టూ 500 ఎకరాల భూమిని కాజేయలేదా అని ప్రశ్నించారు. 

ఇటీవల జరిగిన పురపాలక, ప్రాదేశిక ఎన్నికల్లో ఒక్కో పదవికి ఒక్కో రేటు పెట్టి రూ.50 కోట్లు దోచుకున్నదెవరని పుత్తాను సూటిగా ప్రశ్నించారు. కమలాపురం నగర పంచాయతీ చైర్మన్‌ ఎన్నికల్లో రౌడీయిజం చేసిన పుత్తా ఆ పదవిని రూ.కోటికి అమ్ముకున్నారని ఆరోపించారు. పుత్తాకు డబ్బు పిచ్చి ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కోగటంలో పుత్తా నరసింహారెడ్డి ప్రచారం చేయడం అవివేకమని అన్నారు. 15 ఏళ్ల క్రితం వేసిన సీసీ రోడ్లపై జానబెత్తెడు రోడ్లు వేసి గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కోగటంలో తాము బలపరిచిన వారే గెలుస్తారని వీరశివారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement