● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి
కడప కార్పొరేషన్: సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. శనివారం పూలే వర్థంతి సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషాతో కలిపి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ మహిళా విద్య, సామాజిక సమానత్వం కోసం పూలే జీవితాంతం పోరాడారని గుర్తు చేశారు. ఆనాటి సామాజిక పరిస్థితుల్లో మహిళా విద్య కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. పూలే రైతుల సంక్షేమం కోసం పోరాడిన రైతు బాంధవుడని, బహుజన సామాజిక విప్లవోద్యమానికి పునాదులు వేసిన మహనీయుడని పేర్కొన్నారు. మానవ జాతి ఉన్నంతకాలం ఆయన ఆశయాలు, ఆలోచనలు, సేవాభావం సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్, వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యులు ఎస్. యానాదయ్య, జిల్లా ఽఅధికార ప్రతినిధి పి. జయచంద్రారెడ్డి, ఆ పార్టీ నాయకులు పులి సునీల్, సీహెచ్ వినోద్, ఎస్. వెంకటేశ్వర్లు, బీహెచ్ ఇలియాస్, గంగరాజు, బసవరాజు, కె. శివయాదవ్, సింధేరవి, దాసరి శివప్రసాద్, నాగమల్లారెడ్డి, జాషువా, నాగరాజు, త్యాగరాజు, పవర్ అల్తాఫ్, ఆర్‌వీ రమణ, నరసింహ కుమార్; నాగేంద్ర, గోపాలక్రిష్ణ, రాయల్‌బాబు, షఫీవుల్లా, రామచంద్రయ్య, బాదుల్లా, పస్తం అంజి, బి. మరియలు, నారాయణమ్మ, తులశమ్మ పాల్గొన్నారు. కడప నగరంలోని కడప నగరంలోని పాత బస్టాండ్ సర్కిల్ నందు ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాష పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ పాకా సురేష్, పార్టీ నాయకులు ఆర్. చెన్నయ్య, సుబ్బరాయుడు, కుమార్, ఆర్‌వీ రమణ పాల్గొన్నారు.
డీఎస్పీలతో కలెక్టర్, ఎస్పీ రహస్య మంతనాలు
– ఒత్తిడిలో ఎస్పీ నచికేత్ విశ్వనాథ్
వేంపల్లె : రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శనివారం సాయంత్రం వేంపల్లె కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పరిశీలించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలోని ఓ గదిలో పులివెందుల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు డీఎస్పీలు మురళి నాయక్, బాలస్వామిరెడ్డి, వెంకటేశ్వరరావులతో కలిసి కలెక్టర్, ఎస్పీ 15 నిమిషాల పాటు తలుపులు వేసుకుని రహస్య మంతనాలు జరిపారు. అనంతరం బందోబస్తుపై వివరాలు చెప్పాలని విలేకరులు జిల్లా ఎస్పీని కోరగా మీడియాకు ఎలాంటి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. ఎస్పీ నోటి నుంచి ఒక మాట కూడా రాకపోవడంతో పోలింగ్‌పై అపోహలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల ఒత్తిడి వల్లే ఆయన మీడియాతో మాట్లాడేందుకు విముఖత చూపారనే చర్చ జరుగుతోంది. అధికారుల తీరుతో ఎన్నికలు సజావుగా జరుగుతాయో లేదోనన్న సందేహాలు ప్రజల్లో నెలకొన్నాయి. తర్వాత కలెక్టర్ స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి వెళ్లిపోయారు.


