ఎన్నికల అధికారి వీడియో వైరల్‌ | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల అధికారి వీడియో వైరల్‌

Nov 29 2026 12:32 AM | Updated on Nov 29 2026 12:32 AM

ప్రొద్దుటూరు : మండలంలోని సోములవారిపల్లె గ్రామ పంచాయతీకి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రామ సచివాలయ కార్యదర్శి రాజేందప్రసాద్‌ రెడ్డి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఎన్నికల విధుల్లో ఉన్న ఆయన శుక్రవారం రామేశ్వరంలోని బార్‌లో పట్టపగలు మద్యం సేవిస్తుండటంపై వీడియోలు బయటికి వచ్చాయి. టీడీపీ నేతల ఆదేశాల ప్రకారం పంచాయతీ ఎన్నికలను ఏకపక్షంగా చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ కావడంతో ప్రజల్లో చర్చాంశనీయంగా మారింది. జిల్లా కలెక్టర్‌ ఈ సంఘటనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

సర్పంచ్‌ అభ్యర్థి భర్త కిడ్నాప్‌?

– కుమారుడి వీడియో వైరల్‌

ముద్దనూరు: మంగపట్నం సర్పంచ్‌ అభ్యర్థి సాధు నారాయణమ్మ భర్త కృష్ణమూర్తి (85)ని కూటమి వర్గీయులు కిడ్నాప్‌ చేశారంటూ వారి కుమారుడు నాగేంద్ర విడుదల చేసిన వీడియో వైరల్‌గా మారింది.నామినేషన్‌ విత్‌డ్రా చేసుకోకపోయినా చేసుకున్నట్లు సృష్టించి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ప్రకటించారని, గుర్తు కేటాయించాలని కోరినా ఎంపీడీవో స్పందించలేదని నాగేంద్ర పేర్కొన్నారు. శనివారం సాయంత్రం తమపై ఒత్తిడి పెంచారని, తాము అంగీకరించకపోవడంతో గ్రామానికి చెందిన బోడెద్దుల వినీత్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డితో పాటు మరో ఆరుగురు వచ్చి తన తండ్రిని కిడ్నాప్‌ చేశారని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని కలెక్టర్‌, ఎస్పీలను ఆయన వీడియో ద్వారా వేడుకున్నారు.

మిద్దె పైకప్పు కూలి

యువకుడి మృతి

నందలూరు: నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయ సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో గాలి వెంకట ప్రభు కుమార్‌ (25) అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం.. ఆలయ సమీపంలోని ఓ పురాతన మిద్దెను పడగొట్టే పనుల కోసం ప్రభు కుమార్‌ వెళ్లాడు. పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు భవనం పైకప్పు ఒక్కసారిగా కూలి అతనిపై పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement