ప్రొద్దుటూరు : సోములవారిపల్లె గ్రామ పంచాయతీకి సంబంధించి ఎన్నికల అధికారులు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించిన ఐదుగురు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులైన వార్డు మెంబర్లు శనివారం మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లి తమ రాజీనామా పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి శేఖర్ యాదవ్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆదేశాల మేరకు సర్పంచ్‌తోపాటు 20 వార్డు మెంబర్ల స్థానాలకు కలిపి 44 నామినేషన్లు వేశామని తెలిపారు. అధికారులు సర్పంచ్‌తోపాటు పది మంది వార్డు మెంబర్లను స్క్రూటినీలో తొలగించారన్నారు. మిగిలిన 10 మందిపై పోలీసులు, టీడీపీ నేతలు ఒత్తిడి తేవడంతో రాష్ట్రం విడిచి వెళ్లిపోయారన్నారు. వార్డు మెంబర్ల అభ్యర్థులు అందుబాటులో లేకుండా టీడీపీ నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చి ఐదు మంది తమ వార్డు మెంబర్లను ఏకగ్రీవం అయినట్లు ప్రకటించి, పోటీలో ఉన్న మిగతా ఐదు మందిని తొలగించి ఎన్నికలు లేకుండా చేశారన్నారు. ప్రజాస్వామ్యంలో పోటీ చేసి గెలవాలని తాము భావించామని, టీడీపీ నేతల బిక్ష తమకు అవసరం లేదన్నారు. టీడీపీ నేతలు మాత్రం తాము రాజీ అయినట్లు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఆర్‌ఓ అమ్ముడుపోయారని తెలిపారు. టీడీపీ బుదరలో దొర్లిన పందుల మాదిరి ఉందని ఆ బుదరను తాము అంటించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఈ కారణంగానే తమ అభ్యర్థులు వార్డు మెంబర్ల పదవులకు రాజీనామా చేస్తున్నారని చెప్పారు. అసలు తమ అభ్యర్థులు ఊర్లో లేకుండా ఎలా తొలగించారని, ఏవిధంగా ఏకగ్రీవం అయ్యారని ప్రశ్నించారు. మళ్లీ ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగినప్పుడు తాము పోటీలో పాల్గొంటామన్నారు. 2029 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీకి అభ్యర్థులే ఉండరని తెలిపారు. కార్యక్రమంలో రాజీనామా చేసిన వార్డు మెంబర్లు ఒకటో వార్డు మెంబర్ నల్లిబోయిన బాలరాజు, రెండో వార్డు మెంబర్ అద్దంకి సుజాత, 4వ వార్డు పొన్నతోట జ్యోత్స ్న, 6వ వార్డు ఉమ్మడిశెట్టి సుబ్బరాయుడు, 7వ వార్డు మోతుకూరు సుధాకర్‌తోపాటు ఉపసంహరణకు గురైన వార్డు మెంబర్ల అభ్యర్థులు గోటూరు వెంకటేష్, బల్లా వెంకటలక్ష్మి, పుత్తా మోహన్, సయ్యద్ ఫాతిమాబీ, షేక్ గౌసియా పాల్గొన్నారు.


