ఆర్వోకు టీడీపీ ఎమ్మెల్యే బెదిరింపులు | TDP MLA Amilineni Threatens RO Ananthapur | Sakshi
Sakshi News home page

ఆర్వోకు టీడీపీ ఎమ్మెల్యే బెదిరింపులు

Nov 28 2026 7:09 PM | Updated on Nov 28 2026 7:21 PM

TDP MLA Amilineni Threatens RO Ananthapur

అనంతపురం:  స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏపీ వ్యాప్తంగా అరాచకాలు సృష్టించిన  కూటమి నేతలు.. పంచాయతీ ఎన్నికల్లో కూడా కొనసాగిస్తున్నారు.  అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం పరిధిలోని కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామ సర్పంచ్‌గా వైఎస్సార్‌సీపీ మద్దతుదారు గౌని రేణుక గెలిచారు.  వైఎస్సార్‌సీపీ మద్దతుదారు రేణుక 29 ఓట్లతో గెలుపొందారు. నాలుగుసార్లు రీకౌంటింగ్‌ చేసినా వైఎస్సార్‌సీపీ మద్దతుదారు విజయం సాధించారు.  

ఈ నేపథ్యంలో ఆమె ఇంటిపై దాడులు చేయించారు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు. అదే సమయంలో ఆర్వోను సైతం బెదిరించారు అమిలినేని,. దాంతో 132  ఓట్ల తేడాతో టీడీపీ మద్దతుదారు గెలిచినట్లు ప్రకటించారు. 

కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో  ఏపీవ్యాప్తంగా కూటమి నేతల అరాచకాలు సృష్టించగా, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అమిలినేని సురేంద్ర బాబు అరాచకాలు, అక్రమాలు చేస్తున్నారనే ఆరోపలున్నాయి. బౌన్సర్లతో దాడులు, దౌర్జన్యాలు చేయిస్తున్నారని ఎమ్మెల్యేపై విమర్శలు వచ్చాయి. కౌంటింగ్‌ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, ఏజెంట్లపై దాడులు చేయిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. 

ఇదీ చదవండి: అసభ్యకర డ్యాన్స్‌ చేస్తూ దొరికిపోయిన ఐటీడీపీ ఇంఛార్జ్

 

 

 

 

 

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement