breaking news
amilineni surendrababu
-
నాసిరకం పనులకు రూ.102 కోట్ల నజరానా
సాక్షి, అమరావతి: నాసిరకంగా పనులు చేసిన కాంట్రాక్టు సంస్థపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం తద్భిన్నంగా అంచనా వ్యయాన్ని రూ.102.72 కోట్లు పెంచేసి నజరానా అందించింది. కారణం.. ఆ కాంట్రాక్టు సంస్థ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందినది కావడమే. టెండర్ నిబంధనల ప్రకారం ఆర్నెల్లలోగా పనులు చేయకుండా.. అత్యంత నాసిరకంగా పనులు చేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఆ పనుల అంచనా వ్యయాన్ని పెంచేసి లబ్ధి చేకూర్చడంపై ఇంజినీరింగ్ నిపుణులు, అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం రెండో దశలో శ్రీ సత్యసాయి జిల్లా చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి పుంగనూరు బ్రాంచ్ కెనాల్ ప్రారంభమవుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు రెండు ప్యాకేజీల కింద ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఆ కెనాల్ 0 కిలోమీటర్ నుంచి 26.20 కిలోమీటర్ల వరకు లైనింగ్ పనులను రూ.93.14 కోట్లకు.. 26.2 కిలోమీటర్ల నుంచి 75.075 కిలోమీటర్ల వరకు లైనింగ్ పనులను రూ.173.10 కోట్లకు టీడీపీ ఎమ్మెల్యే అమిలినేనికి చెందిన ఎస్సార్ కన్స్ట్రక్షన్స్ దక్కించుంది. ఆ పనులను ఆర్నెల్ల్లలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు పెట్టింది.ఈ ఫొటో చూడండి.. శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం కొక్కంటి క్రాస్‌కు సమీపంలో హంద్రీ–నీవా రెండో దశలో అంతర్భాగమైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌కు స్టీల్ ఫైబర్ రీయిన్‌ఫోర్స్‌డ్ కాంక్రీట్ (ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ) విధానంలో వేసిన లైనింగ్ పనితనం నీటి ప్రవాహం ఆగిపోగానే బట్టబయలైంది. టెండర్ నిబంధనల ప్రకారం రాతి పొర, డీప్ కట్ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే షార్ట్ క్రీటింగ్ విధానంలో లైనింగ్ చేయాలి. కానీ.. నిబంధనను ఉల్లంఘించి, పనులు వేగంగా చేయాలనే మిషతో ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ విధానంలో లైనింగ్ వేశారు. చిన్న చిన్న ఇనుప తీగలు, సిమెంటు, సిలికా, ఇసుక, కంకర, నీటితో కలిపి ఎస్‌ఎఫ్‌ఆర్‌సీని తయారు చేస్తారు. కాలువకు రాతి పొర ఉన్న ప్రదేశంలో మాత్రమే.. కాలువ గట్టు వాలు (స్లోప్)ను క్రమానుగతంగా ఉండేలా సరిచేసుకుని (సెక్షనింగ్).. ఆ తర్వాత 38 మిల్లీమీటర్ల (ఎంఎం) మందంతో ఒకసారి, ఆ తర్వాత 38 ఎంఎం మందంతో మరోసారి అధిక ఒత్తిడితో ఎస్‌ఎఫ్‌ఆర్‌సీతో లైనింగ్ చేయాలి. కానీ, మట్టి పొరకే.. అదీ కాలువ గట్టు వాలును క్రమానుగతంగా ఉండేలా చేయకుండానే, గట్టు వాలు ఎగుడు దిగుడుగా ఉన్నప్పటికీ 10 నుంచి 20 ఎంఎం మందంతో ఎస్‌ఎఫ్‌ఆర్‌సీతో లైనింగ్ వేశారు. పనులు చేసిన సంస్థ కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందినది కావడంతో వాటిని పర్యవేక్షిస్తున్న అధికారులు నాణ్యతపై నోరు మెదపలేకపోయారు. నాణ్యతను పర్యవేక్షించాల్సిన క్వాలిటీ కంట్రోల్ విభాగం నిద్రపోయింది. బిల్లులు కూడా చెల్లించేశారు. గత సీజన్లో కాలువలో ప్రవహించిన నీటి ఉద్ధృతికే కాంక్రీట్ ఎక్కడికక్కడ జారిపోయి, కరిగిపోయి కొట్టుకుపోయింది.నాసిరకానికి ఈ ఫొటోనే సాక్ష్యం.. శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కొండమనాయునిపాలెం వద్ద పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌కు ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ విధానంలో అత్యంత నాసిరకంగా లైనింగ్ వేశారనడానికి ఇదిగో ఆధారం. ఒక సీజన్లో నీటి ప్రవాహానికే కాంక్రీట్ జారిపోయి, కరిగిపోయి కొట్టుకుపోయింది. కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అయ్యింది.ఈ ఫొటో మరో నిదర్శనం.. శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం కళ్లిపల్లి సమీపంలో పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌కు ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ విధానంలో అత్యంత నాసిరకంగా లైనింగ్ పనులు చేశారనడానికి ఇది మరో నిదర్శనం. కనీసం కాలువ స్లోప్ను కూడా సరి చేయకుండా ఇష్టారాజ్యంగా లైనింగ్ చేయడం వల్ల ఒక సీజన్లో నీటి ప్రవాహానికే కాంక్రీట్ కొట్టుకుపోయింది.ఇదిగో బహుమానంపుంగనూరు బ్రాంచ్ కెనాల్లో 26.2 కిలోమీటరు నుంచి 75.075 కిలోమీటర్ వరకు లైనింగ్ పనులు చేపట్టడానికి రూ.207.20 కోట్లతో 2024 డిసెంబర్ 3న ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. ఇవే పనులను జీఎస్టీ, సీనరేజీ వంటి పన్నులు మినహాయించి రూ.173.10 కోట్లకు ఎస్సార్ కన్స్ట్రక్షన్స్కు ప్రభుత్వం అప్పగించింది. సకాలంలో నాణ్యంగా పనులు చేయని ఆ కాంట్రాక్టు సంస్థపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం తద్భిన్నంగా వ్యవహరించింది. ఆ పనుల అంచనా వ్యయాన్ని రూ.309.92 కోట్లకు పెంచేస్తూ మే 4న ఉత్తర్వులు జారీ చేసింది. అంటే.. నాసిరకంగా పనులు చేసిన టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సంస్థకు రూ.102.72 కోట్ల మేర లబ్ధి చేకూర్చినట్లు స్పష్టమవుతోంది.నిబంధనలకు విరుద్ధంగా ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ లైనింగ్ టెండర్ నిబంధనల ప్రకారం రాతి పొర ఉన్న చోట్ల మాత్రమే షార్ట్ క్రీటింగ్ విధానంలో లైనింగ్ చేయాలి. నిబంధనల్లో ఎక్కడా ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ ప్రస్తావనే లేదు. టెండర్ పేర్కొన్న దానికి భిన్నంగా పని స్వభావం మారితే స్టేట్ లెవల్ టెక్నికల్ కమిటీ (ఎస్‌ఎల్‌టీసీ) ఆమోదం పొంది.. ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. కానీ.. టెండర్లో నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలనే సాకు చూపి.. షార్ట్ క్రీటింగ్ విధానంలో పనులు చేస్తే జాప్యం జరుగుతుందని సాకులు వెతికి.. ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ విధానాన్ని కాంట్రాక్టర్లు ప్రతిపాదించారు. అయినా ఆ పనులను పర్యవేక్షిస్తున్న ఇంజినీరింగ్ అధికారులు నోరు మెదపలేక పోయారని జల వనరుల శాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి. రాతి పొర లేకున్నా.. మట్టి పొరకే.. కనీసం కాలువ గట్ల వాలును క్రమానుగతంగా సరి చేయకుండానే ఇష్టారాజ్యంగా అత్తెసరు మందంతో ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ విధానంలో కాంట్రాక్టర్లు లైనింగ్ పనులు కానిచ్చేశారు. షార్ట్ క్రీటింగ్ పద్ధతిలో లైనింగ్ చేస్తే చదరపు మీటరుకు రూ.1,407 చొప్పున బిల్లు చెల్లిస్తారు. అదే ఎస్‌ఎఫ్‌ఆర్‌సీతో లైనింగ్ చేస్తే రూ.1,854 చెల్లిస్తారు. కానీ.. హంద్రీ–నీవా పనుల్లో మాత్రం రూ.2,400 చొప్పున బిల్లులు చెల్లిండంపై ఇంజినీరింగ్ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ విధానంలో అత్యంత నాసిరకంగా వేసిన లైనింగ్ ఒక్క సీజన్లో నీటి ప్రవాహానికే ఎక్కడికక్కడ కొట్టుకుపోయింది.లైనింగ్ పనులు చేయాల్సింది ఇలా..» తొలుత కాలువపై ముళ్ల కంప చెట్లను తొలగించాలి. కాలువపై ఇన్స్పెక్షన్ పాత్ (దారి) వేయాలి. కాలువకు ఇరు వైపులా.. అడుగు భాగంలో ఇన్క్లెయిన్డ్ రోలర్ (పొక్లెయినర్‌కు రోలర్‌ను అమర్చడం)తో గట్టిపరచాలి.» ఆ తర్వాత 12 ఎంఎం, 20 ఎంఎం గ్రానైట్ కంకర, నాణ్యమైన ఇసుక, సిమెంటుతో తయారు చేసిన ఎం–25 మిక్సర్, ఎం–20 మిక్సర్‌తో పేవర్ మిషన్ ద్వారా కాలువకు ఇరు వైపులా లైనింగ్ వేయాలి. ఆ తర్వాత అడుగు భాగంలో లైనింగ్ వేయాలి. రెండు వారాలపాటు క్యూరింగ్ (నీటితో తడపాలి) చేయాలి.» రాతి పొర ఉన్న ప్రాంతాల్లో షార్ట్ క్రీటింగ్ విధానంలో లైనింగ్ చేయాలి. రాతి పొరకు ఇనుప బోల్ట్ కొట్టి.. దానికి ఇనుప జాలరీ అమర్చి.. దానిపై అధిక ఒత్తిడితో ఎం–20 కాంక్రీట్ వేయాలి. » పనులను ఏఈ, డీఈ, ఈఈలు నిరంతరం పర్యవేక్షించాలి. ఎస్ఈ, సీఈలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి. నాణ్యత నియంత్రణ విభాగం(క్వాలిటీ కంట్రోల్) అధికారులు ఎప్పటికప్పుడు సిమెంటు కాంక్రీట్ లైనింగ్ శాంపుల్స్‌ను తీసి.. ల్యాబొరేటరీల్లో పరీక్షించి నాణ్యతను ధ్రువీకరించాలి. నాసిరకంగా ఉన్నట్లు తేలితే.. వాటిని తొలగించి మళ్లీ నాణ్యంగా పనులు చేయించాలి.» పనులు దక్కించుకున్న ప్రధాన కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించడానికి వీల్లేదు. ఏవైనా పనులను సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించాలంటే జల వనరుల శాఖ అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి. 50 శాతం లోపు పనులను అధికారుల అనుమతితో సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించడానికి అవకాశం ఉంటుంది. కానీ.. పనుల నాణ్యతకు ప్రధాన కాంట్రాక్టరే బాధ్యత వహించాల్సి ఉంటుంది.లైనింగ్ పనులు చేసింది ఇలా..» కాలువ గట్లపై ముళ్ల కంప చెట్లను తొలంచి, దారిని వేశారు. కానీ.. ఇన్క్లెయిన్డ్ రోలర్‌తో కాలువ ఇరు వైపులా అడుగు భాగాన్ని గట్టి పరచకుండా కేవలం పొక్లెయిన్ బకెట్‌తో తూతూ మంత్రంగా గట్టిపరిచే పనులు కానిచ్చేశారు. దాంతో కాలువకు ఇరు వైపులా మట్టి ఎక్కడికక్కడ జారిపోయింది. » గతంలో కాలువ తవ్వినప్పుడు వచ్చిన మట్టిని, రాళ్లను గట్లపై పోశారు. ఆ గట్లపై ఉన్న రాళ్ల నుంచి కంకర తయారు చేశారు. ఆ కంకర పిండి పిండిగా నాసిరకంగా ఉంది. సమీపంలో వాగులు, వంకల్లో ఇసుకను తెచ్చారు. నాసిరకం కంకర, ఇసుక.. తక్కువ పరిమాణంలో సిమెంటుతో ఎం–25 మిక్సర్ (ఒక పాలు సిమెంటు, ఒక పాలు ఇసుక, రెండు పాళ్లు 20 ఎంఎం కంకర కలిపి తయారుచేసే మిశ్రమం), ఎ0–20 (ఒక పాలు సిమెంటు, 1.5 పాళ్లు ఇసుక, 3 పాళ్లు 12 ఎంఎం కంకర కలిపి తయారుచేసే మిశ్రమం) మిక్సర్ తయారు చేశారు. » కాలువకు ఇరువైపులా ఇన్క్లెయిన్డ్ రోలర్‌తో గట్టిపరచక పోవడంతో ఎక్కడికక్కడ మట్టి జారిపోతున్నా పేవర్ యంత్రాన్ని వినియోగించకుండా.. కార్మికులతోనే సిమెంటు కాంక్రీట్‌తో లైనింగ్ చేశారు. మట్టి జారిపోతున్నా సరే అలానే లైనింగ్ వేశారు. దీనివల్ల గత ఆగస్టులో కాలువకు నీటిని విడుదల చేయగానే లైనింగ్ ఎక్కడికక్కడ జారిపోయి కొట్టుకుపోయింది. ఎం–25, ఎం–20 కాంక్రీట్‌లో సిమెంటు తక్కువగా, ఇసుక ఎక్కువగా, నాసిరకం కంకర వినియోగించడం వల్ల లైనింగ్ చేసిన ప్రాంతాల్లో ఇసుకపైకి తేలి స్పష్టంగా కన్పిస్తోంది. -
టీడీపీ ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు.. 100 స్టాంపును 1,00,000 స్టాంపుగా మార్చి..
-
నా భర్త పోలీస్.. ఏ ప్రయోజనం.. పోలీసులే మమల్ని బెదిరిస్తున్నారు.
-
కుప్పం చేసిన పుణ్యం ఏంటి..? కళ్యాణదుర్గం చేసిన పాపం ఏంటి..?
-
ఈ-స్టాంపుల కుంభకోణం.. టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడు సహా ముగ్గురి అరెస్ట్
సాక్షి,అనంతపురం: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ ఈ–స్టాంపుల కుంభకోణాన్ని పోలీసులు చేధించారు. కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ముఖ్య అనుచరుడు ఎర్రన్న అలియాస్ మీసేవ బాబు సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం నకిలీ ఈ-స్టాంపుల కుంభకోణం గురించి ఎస్పీ జగదీష్ మీడియాతో మాట్లాడారు.టీడీపీ నేత ఎర్రన్న అలియాస్ మీసేవ బాబు 15 వేల నకిలీ ఈ-స్టాంపులు తయారు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. 100 రూపాయల స్టాంప్‌ల సున్నాలు మార్చి లక్ష రూపాయల స్టాంప్‌గా నిందితులు మార్చారు. ఫోటో షాప్‌లో ఎడిట్ చేసి నకిలీ ఈ-స్టాంపులు తయారు చేసినట్లు తేలింది. టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుకు చెందిన ఎస్ఆర్ కన్ స్ట్రక్షన్ సంస్థకు టీడీపీ నేత ఎర్రన్న అలియాస్ మీసేవ బాబు 481 నకిలీ ఈ-స్టాంపులు విక్రయించిన ఆధారాలు సేకరించారు. కంప్యూటర్లు, ప్రింటర్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇదీ అసలు కథఇదో భారీ కుంభకోణం! ఓ దళారీని అడ్డుపెట్టుకుని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఫోర్జరీతో రూ.వందల కోట్ల మేర బ్యాంకు రుణాలు కాజేసిన ఓ కంపెనీ దీన్ని కప్పిపుచ్చుకునేందుకు కట్టు కథలు చెబుతోంది. స్టాంప్ డ్యూటీ చెల్లింపుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని, తప్పుడు ఈ – స్టాంప్‌లతో బ్యాంకులు, ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వాలను మోసం చేసిన ఓ టీడీపీ ఎమ్మెల్యే నిర్వాకం ఇదీ!! తప్పుడు డాక్యుమెంట్లతో రుణాలు తీసుకుని బ్యాంకులను మోసం చేశారు. ఆస్తుల విలువను అధికంగా చూపించి ఫేక్ పత్రాలు సృష్టించారు.టీడీపీ ఎమ్మెల్యే నానా తంటాలుఅనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ బ్యాంకు రుణాలు తీసుకుని ఈ – స్టాంప్ డ్యూటీ చెల్లింపుల్లో భారీ కుంభకోణానికి పాల్పడింది. ఈ వ్యవహారం బహిర్గతం కావడంతో దీన్ని ఓ దళారీపై నెట్టేసి బయటపడేందుకు టీడీపీ ఎమ్మెల్యే నానా తంటాలు పడుతున్నారు. ఈ స్కామ్‌లో కీలక పాత్రధారి టీడీపీ ఎమ్మెల్యే సురేంద్ర అనుచరుడు బోయ ఎర్రప్ప అలియాస్ ‘మీ–సేవ బాబు’! టీడీపీ ప్రజా ప్రతినిధి అండదండలు లేకుంటే ఓ సాధారణ మీ–సేవా కేంద్రం నిర్వాహకుడు ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటాడు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.ఈ స్టాంప్‌ల కోసం మీ–సేవ సెంటర్ నిర్వాహకుడు బాబుతో టీడీపీ ఎమ్మెల్యే సురేంద్ర సన్నిహిత సంబంధాలు నెలకొల్పాడు. ‘మీ–సేవ బాబు’ కూడా టీడీపీ కుటుంబ సభ్యుడే! మహానాడులో కూడా పాల్గొన్నాడు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు ఎమ్మెల్యే సురేంద్ర ఇంట్లో మనిషిలా మీసేవ బాబు వ్యవహరిస్తుంటాడు. ఈ కుంభకోణం వివరాలివీ...బ్యాంకు నుంచి రూ.900 కోట్ల రుణంటీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటకలో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీ ఈ ఏడాది యూనియన్ బ్యాంకు నుంచి రూ.900 కోట్ల మేర రుణం తీసుకుంది. ఆస్తులు తనఖా పెట్టి ఆ గ్యారెంటీతో రుణాలు తీసుకోవాలి. దీని కోసం ముందుగా స్టాంప్‌డ్యూటీ చెల్లించి తనఖా వివరాలు పొందుపరిచి ఈ–స్టాంప్ పొందాలి. రిజి్రస్టేషన్ ఫీజు, యూజర్ చార్జీలు చెల్లించాలి. బ్యాంకు రుణంలో 0.5 శాతం స్టాంప్ డ్యూటీ కింద కంపెనీ కట్టాలి. అంటే రూ.900 కోట్ల రుణానికి రూ.4.5 కోట్లు స్టాంప్ డ్యూటీ చెల్లించాలి. అయితే ఎస్ఆర్సీ మాత్రం నాలుగు డాక్యుమెంట్ల ద్వారా మొత్తం రూ.1,51,700 మాత్రమే చెల్లించింది. అంటే రూ.4,48,48,300 మేర స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖను మోసగించింది! మోసం చేశారిలా.. ఈ–స్టాంప్‌లో 0.5 శాతం చెల్లించాల్సిన మొత్తాన్ని స్వల్పంగా చూపించి డాక్యుమెంట్‌ను మీ–సేవ బాబు జనరేట్ చేస్తాడు. జనరేట్ అయిన డాక్యుమెంట్లో స్టాంప్ డ్యూటీ మొత్తాన్ని ఫ్యాబ్రికేట్ చేసి నిబంధనల ప్రకారం ఎంత చెల్లించాలో ఆ మొత్తాన్ని ఎంటర్ చేసి మరో ప్రింట్ తీసి కంపెనీ ప్రతినిధులకు అందించాడు. దీన్ని బ్యాంకులకు సమర్పించి రూ.900 కోట్ల రుణం తీసుకున్నారు. ఇలా స్టాంప్ డ్యూటీ చెల్లింపులో కుంభకోణానికి పాల్పడ్డారు. తప్పుడు ఈ – స్టాంప్ పత్రాలను సమర్పించి రూ.900 కోట్ల రుణం తీసుకోవడం ద్వారా బ్యాంకును, ఆర్బీఐని మోసగించారు.టాటా క్యాపిటల్స్ రుణాల్లోనూ ఇదే స్కామ్ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ టాటా క్యాపిటల్స్ నుంచి రూ.20 కోట్లు రుణం తీసుకునేందుకు 2024 నవంబర్ 7న ఈ–స్టాంప్ డ్యూటీ చెల్లించారు. దీనికి కేవలం రూ.200 మాత్రమే ఈ–స్టాంప్ డ్యూటీ కట్టారు. ఈ డాక్యుమెంట్లో స్టాంప్‌డ్యూటీ మొత్తాన్ని ఎడిట్ చేసి 0.5 శాతం చొప్పున రూ.10 లక్షలుగా అంకెలు మార్చి టాటా క్యాపిటల్స్‌కు సమర్పించారు. ఈ విధంగా బ్యాంకు రుణాల్లో ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కుంభకోణానికి పాల్పడింది. స్టాంప్ డ్యూటీ కుంభకోణంపై ఆధారాలతో ఫిర్యాదు అందడంతో స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో పాటు స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ అధికారులు దీనిపై విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో ఎమ్మెల్యేకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ప్రతినిధులు రంగంలోకి దిగారు. కంపెనీ ప్రతినిధులు తనకు డబ్బులు ఇచి్చనట్లు, అయితే తానే ఆ డబ్బులు చెల్లించకుండా అవకతవకలకు పాల్పడినట్లు ఈ–సేవా నిర్వాహకుడు బాబుతో కొన్ని పత్రాలపై సంతకాలు చేయించుకోవడంతో పాటు ఓ ఆడియో రికార్డును కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.బుకాయిస్తే మాత్రం దాగుతుందా..! స్టాంప్ డ్యూటీ చెల్లింపులకు సంబంధించి కంపెనీ చెక్ ఇచ్చి ఉండాలి. లేదంటే ఆర్టీజీఎస్, డీడీతో పాటు ఏ రకమైనా చెల్లింపులైనా వైట్మనీగానే చెల్లించాలి. ఎస్ఆర్ కంపెనీ ఆ రకమైన చెల్లింపులు చేయలేదు. దీంతో మీ–సేవా బాబుకు తాము డబ్బులు ఇచ్చామని బలవంతంగా ఒప్పించినా, అందులో వాస్తవం లేదని బహిర్గతం అవుతుంది. కంపెనీ మోసం బట్టబయలవుతుంది. ఈ రెండు రుణాలు మాత్రమే కాదని, తప్పుడు ఈ–స్టాంప్ పత్రాలతో చాలా రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఫేక్ ఈ–స్టాంపు పేపర్లను విక్రయించిన మీసేవ బాబు, ఆయన భార్య కట్టా భార్గవిపై అనంతపురం టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రతినిధి గుంటూరు సతీష్‌బాబు పేర్కొన్నారు. తమ అకౌంట్స్ విభాగం డాక్యుమెంట్లను పరిశీలించగా ఈ–స్టాంపుల ఫోర్జరీ వెలుగులోకి వచ్చిందన్నారు. మీ–సేవ బాబు అలియాస్ బోయ ఎర్రప్ప, కట్టా భార్గవిపై బీఎన్ఎస్ 318(4), 338, 340, ఆర్/డబ్ల్యూ 3 (5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఇది ఎమ్మెల్యే గారి అసలు కథ.. బయటపెట్టిన తలారి రంగయ్య
-
సంబంధం లేకుండానే కలిసి మెలిసి తిరిగారా?: తలారి రంగయ్య
సాక్షి, తాడేపల్లి: బ్యాంక్ రుణాల కోసం ఈ–స్టాంప్ డ్యూటీ చెల్లింపుల్లో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఎ.సురేంద్రబాబు భారీ స్కామ్ చేశారని, దీనిపై వెంటనే సీబీఐ దర్యాప్తు చేసేలా సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయాలని అనంతపురం మాజీ ఎంపీ తలారి రంగయ్య డిమాండ్ చేశారు.తన అనుచరుడిని దళారిగా చేసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించిన ఎమ్మెల్యే, ఫోర్జరీతో వందల కోట్ల బ్యాంక్ రుణాలు కాజేశారని ఆయన ఆరోపించారు. దాన్నుంచి తప్పించుకునేందుకు ఎమ్మెల్యే, తన దళారి ‘మీ–సేవ’ నిర్వాహకుడైన బాబుపై మొత్తం నింద వేశారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ తలారి రంగయ్య తెలిపారు. ప్రెస్మీట్లో మాజీ ఎంపీ ఇంకా ఏం మాట్లాడారంటే..:‘మీసేవ’ నిర్వాహకుడికి అది సాధ్యమా?:కళ్యాణదుర్గం కేంద్రంగా నకిలీ ఈ–స్టాంప్ డ్యూటీ కుంభకోణం జరిగింది. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఎ.సురేంద్రబాబు తన కన్సట్రక్షన్ కంపెనీకి బ్యాంక్ రుణాలు పొందేందుకు, తన అనుచరుడిని దళారిగా మార్చి ఈ స్కామ్ చేశారు. గతంలో దేశవ్యాప్తంగా కలకలం రేపిన నకిలీ స్టాంప్‌ల స్కామ్‌లో, రాష్ట్రంలో టీడీపీకి చెందిన ఒక నాయకుడి ప్రమేయం బయటపడింది. మళ్లీ ఇప్పుడు అదే టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ స్కామ్ వెలుగు చూసింది.ఈ వ్యవహారం బహిర్గతం కావడంతో దాన్ని ‘మీ–సేవ’ నిర్వాహకుడైన బాబుపై నెట్టేసి బయటపడేందుకు టీడీపీ ఎమ్మెల్యే నానా తంటాలు పడుతున్నారు. నిజానికి ఈ స్కామ్‌లో కీలక పాత్రధారి టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరుడు బోయ ఎర్రప్ప అలియాస్ ‘మీ–సేవ బాబు’. ఎమ్మెల్యే అండదండలు లేకుంటే ఓ సాధారణ మీ–సేవా కేంద్ర నిర్వాహకుడు అంత రిస్క్ ఎందుకు తీసుకుంటాడు?ఎమ్మెల్యే పదవికి సురేంద్రబాబు రాజీనామా చేయాలి:42 ఏళ్ల అనుభవం ఉందని ఆడిటర్, మాకు 27 సంవత్సరాల అనుభవం ఉందని ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ చెబుతోంది. రెండు మూడు సంవత్సరాల క్రితం కొన్న స్టాంపులకు సంబంధించి మనం కడుతున్న డబ్బులు ప్రభుత్వ ఖజానాకు చేరుతున్నాయో తెలుసుకోలేనప్పుడు ఆ అనుభవం ఉండి ఏం ప్రయోజనం?ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ మీద ఆధారపడి 20 వేల కుటుంబాలున్నాయని, అందువల్ల బురద జల్లొద్దని నీతులు చెబుతున్నారు. మీ మీద బురద జల్లాల్సిన అవసరం మాకు లేదు. స్కామ్ జరిగిందని మీరే చెబుతున్నప్పుడు మీ మీద బురద జల్లాల్సిన అవసరం మాకు ఎందుకుంటుంది?. ఒకవేళ ఎమ్మెల్యే సురేంద్రబాబు హంసలాగా స్వచ్ఛమైన వారైతే, వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోలీసుల దర్యాప్తునకు సహకరించాలి.‘మీ–సేవ’ బాబుతో తనకేం సంబంధం లేదని ఎస్సార్సీ కంపెనీ యజమాని, టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబు చెబుతున్నారు. ఏం సంబంధం లేకుండానే పార్టీ ప్రచార కార్యక్రమాల్లో ఆయన మీతో తిరుగుతారా? ఆయన కొడుకు పుట్టినరోజున మీరు వెళ్లి కేకు తినిపించి వస్తారా? అలాగే మీ పుట్టినరోజుకి మీసేవ బాబు వచ్చి కేకు ఎందుకు తినిపించారు? అంతే కాకుండా మీరిద్దరూ కలిసి నారా లోకేష్‌ను ఎందుకు కలిశారు? మీ బంధాన్ని ధృవపర్చేలా సోషల్ మీడియాలో తిరుగుతున్న ఈ ఫొటోలన్నింటికీ ఏం సమాధానం చెబుతారు?.ఆ అరెస్టులు ఎందుకు చూపడం లేదు?:స్టాంప్ డ్యూటీ స్కామ్‌కు సంబంధించి ‘మీ–సేవ’ నిర్వాహకుడు బాబుతో పాటు, గొల్ల భువనేశ్వర్, మంజు, మోహన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అయిదు రోజులవుతున్నా, వారి అరెస్టు చూపలేదు. కోర్టులో హాజరుపర్చలేదు. దీంతో వారంతా ఎక్కడున్నారో అంతు చిక్కడం లేదు. దీనిపై పోలీసులు వెంటనే ఒక ప్రకటన చేయాలి.‘సిట్’ కాదు. సీబీఐ దర్యాప్తు చేయాలి:కళ్యాణదుర్గంలో స్టాంప్ డ్యూటీ స్కామ్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేయడం సరికాదు. ఎందుకంటే ఈ కేసులో ప్రధాన నిందితుడు అధికార పార్టీ ఎమ్మెల్యే. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేసే ‘సిట్’ వల్ల ఒరిగేదేమీ ఉండదు. అందుకే ఈ స్కామ్‌పై సీబీఐతో దర్యాప్తు చేయించాలి. అందుకోసం సీఎం చంద్రబాబు స్వయంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి. అలా ప్రభుత్వం తన నిజాయితీ నిరూపించుకోవాలి.హైకోర్టు తలుపు తడుతా:పోలీసులు అదుపులోకి తీసుకున్న ‘మీ–సేవ’ నిర్వాహకుడు బాబు ఎక్కడున్నాడో చెప్పకుండా ఆయన ఇంట్లో 2 కేజీల బంగారం, రూ.2 కోట్ల నగదు దొరికిందని.. ఆయన, ఆయన భార్య బ్యాంక్ ఖాతాల్లో భారీ లావాదేవీలున్నాయని లీక్‌లు ఇస్తున్నారు. కానీ, ఆయన ఎక్కడున్నాడో మాత్రం చెప్పడం లేదు. అందుకే బాబుతో సహా, మిగిలిన వారందరినీ వెంటనే మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చాలి. లేకపోతే హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయాల్సి వస్తుందని మాజీ ఎంపీ తలారి రంగయ్య హెచ్చరించారు. -
టీడీపీ ఎమ్మెల్యే కంపెనీ.. ‘స్టాంప్ డ్యూటీ’ స్కామ్
అనంతపురం, సాక్షి అమరావతి, సాక్షి టాస్క్‌ఫోర్స్: ఇదో భారీ కుంభకోణం! ఓ దళారీని అడ్డుపెట్టుకుని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఫోర్జరీతో రూ.వందల కోట్ల మేర బ్యాంకు రుణాలు కాజేసిన ఓ కంపెనీ దీన్ని కప్పిపుచ్చుకునేందుకు కట్టు కథలు చెబుతోంది. స్టాంప్ డ్యూటీ చెల్లింపుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని, తప్పుడు ఈ – స్టాంప్‌లతో బ్యాంకులు, ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వాలను మోసం చేసిన ఓ టీడీపీ ఎమ్మెల్యే నిర్వాకం ఇదీ!! తప్పుడు డాక్యుమెంట్లతో రుణాలు తీసుకుని బ్యాంకులను మోసం చేశారు. ఆస్తుల విలువను అధికంగా చూపించి ఫేక్ పత్రాలు సృష్టించారు.అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ బ్యాంకు రుణాలు తీసుకుని ఈ – స్టాంప్ డ్యూటీ చెల్లింపుల్లో భారీ కుంభకోణానికి పాల్పడింది. ఈ వ్యవహారం బహిర్గతం కావడంతో దీన్ని ఓ దళారీపై నెట్టేసి బయటపడేందుకు టీడీపీ ఎమ్మెల్యే నానా తంటాలు పడుతున్నారు. ఈ స్కామ్‌లో కీలక పాత్రధారి టీడీపీ ఎమ్మెల్యే సురేంద్ర అనుచరుడు బోయ ఎర్రప్ప అలియాస్ ‘మీ–సేవ బాబు’! టీడీపీ ప్రజా ప్రతినిధి అండదండలు లేకుంటే ఓ సాధారణ మీ–సేవా కేంద్రం నిర్వాహకుడు ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటాడు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.ఈ స్టాంప్‌ల కోసం మీ–సేవ సెంటర్ నిర్వాహకుడు బాబుతో టీడీపీ ఎమ్మెల్యే సురేంద్ర సన్నిహిత సంబంధాలు నెలకొల్పాడు. ‘మీ–సేవ బాబు’ కూడా టీడీపీ కుటుంబ సభ్యుడే! మహానాడులో కూడా పాల్గొన్నాడు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు ఎమ్మెల్యే సురేంద్ర ఇంట్లో మనిíÙలా మీసేవ బాబు వ్యవహరిస్తుంటాడు. ఈ కుంభకోణం వివరాలివీ...బ్యాంకు నుంచి రూ.900 కోట్ల రుణంటీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటకలో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీ ఈ ఏడాది యూనియన్ బ్యాంకు నుంచి రూ.900 కోట్ల మేర రుణం తీసుకుంది. ఆస్తులు తనఖా పెట్టి ఆ గ్యారెంటీతో రుణాలు తీసుకోవాలి. దీని కోసం ముందుగా స్టాంప్‌డ్యూటీ చెల్లించి తనఖా వివరాలు పొందుపరిచి ఈ–స్టాంప్ పొందాలి. రిజి్రస్టేషన్ ఫీజు, యూజర్ చార్జీలు చెల్లించాలి. బ్యాంకు రుణంలో 0.5 శాతం స్టాంప్ డ్యూటీ కింద కంపెనీ కట్టాలి. అంటే రూ.900 కోట్ల రుణానికి రూ.4.5 కోట్లు స్టాంప్ డ్యూటీ చెల్లించాలి. అయితే ఎస్ఆర్సీ మాత్రం నాలుగు డాక్యుమెంట్ల ద్వారా మొత్తం రూ.1,51,700 మాత్రమే చెల్లించింది. అంటే రూ.4,48,48,300 మేర స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖను మోసగించింది! మోసం చేశారిలా.. ఈ–స్టాంప్‌లో 0.5 శాతం చెల్లించాల్సిన మొత్తాన్ని స్వల్పంగా చూపించి డాక్యుమెంట్‌ను మీ–సేవ బాబు జనరేట్ చేస్తాడు. జనరేట్ అయిన డాక్యుమెంట్లో స్టాంప్ డ్యూటీ మొత్తాన్ని ఫ్యాబ్రికేట్ చేసి నిబంధనల ప్రకారం ఎంత చెల్లించాలో ఆ మొత్తాన్ని ఎంటర్ చేసి మరో ప్రింట్ తీసి కంపెనీ ప్రతినిధులకు అందించాడు. దీన్ని బ్యాంకులకు సమర్పించి రూ.900 కోట్ల రుణం తీసుకున్నారు. ఇలా స్టాంప్ డ్యూటీ చెల్లింపులో కుంభకోణానికి పాల్పడ్డారు. తప్పుడు ఈ – స్టాంప్ పత్రాలను సమర్పించి రూ.900 కోట్ల రుణం తీసుకోవడం ద్వారా బ్యాంకును, ఆర్బీఐని మోసగించారు.టాటా క్యాపిటల్స్ రుణాల్లోనూ ఇదే స్కామ్ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ టాటా క్యాపిటల్స్ నుంచి రూ.20 కోట్లు రుణం తీసుకునేందుకు 2024 నవంబర్ 7న ఈ–స్టాంప్ డ్యూటీ చెల్లించారు. దీనికి కేవలం రూ.200 మాత్రమే ఈ–స్టాంప్ డ్యూటీ కట్టారు. ఈ డాక్యుమెంట్లో స్టాంప్‌డ్యూటీ మొత్తాన్ని ఎడిట్ చేసి 0.5 శాతం చొప్పున రూ.10 లక్షలుగా అంకెలు మార్చి టాటా క్యాపిటల్స్‌కు సమర్పించారు. ఈ విధంగా బ్యాంకు రుణాల్లో ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కుంభకోణానికి పాల్పడింది. స్టాంప్ డ్యూటీ కుంభకోణంపై ఆధారాలతో ఫిర్యాదు అందడంతో స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో పాటు స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ అధికారులు దీనిపై విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో ఎమ్మెల్యేకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ప్రతినిధులు రంగంలోకి దిగారు. కంపెనీ ప్రతినిధులు తనకు డబ్బులు ఇచి్చనట్లు, అయితే తానే ఆ డబ్బులు చెల్లించకుండా అవకతవకలకు పాల్పడినట్లు ఈ–సేవా నిర్వాహకుడు బాబుతో కొన్ని పత్రాలపై సంతకాలు చేయించుకోవడంతో పాటు ఓ ఆడియో రికార్డును కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.బుకాయిస్తే మాత్రం దాగుతుందా..! స్టాంప్ డ్యూటీ చెల్లింపులకు సంబంధించి కంపెనీ చెక్ ఇచ్చి ఉండాలి. లేదంటే ఆర్టీజీఎస్, డీడీతో పాటు ఏ రకమైనా చెల్లింపులైనా వైట్మనీగానే చెల్లించాలి. ఎస్ఆర్ కంపెనీ ఆ రకమైన చెల్లింపులు చేయలేదు. దీంతో మీ–సేవా బాబుకు తాము డబ్బులు ఇచ్చామని బలవంతంగా ఒప్పించినా, అందులో వాస్తవం లేదని బహిర్గతం అవుతుంది. కంపెనీ మోసం బట్టబయలవుతుంది.ఈ రెండు రుణాలు మాత్రమే కాదని, తప్పుడు ఈ–స్టాంప్ పత్రాలతో చాలా రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఫేక్ ఈ–స్టాంపు పేపర్లను విక్రయించిన మీసేవ బాబు, ఆయన భార్య కట్టా భార్గవిపై అనంతపురం టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రతినిధి గుంటూరు సతీష్‌బాబు పేర్కొన్నారు. తమ అకౌంట్స్ విభాగం డాక్యుమెంట్లను పరిశీలించగా ఈ–స్టాంపుల ఫోర్జరీ వెలుగులోకి వచి్చందన్నారు. మీ–సేవ బాబు అలియాస్ బోయ ఎర్రప్ప, కట్టా భార్గవిపై బీఎన్ఎస్ 318(4), 338, 340, ఆర్/డబ్ల్యూ 3 (5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. -
కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ప్రలోభాలు
-
టీడీపీ నేత ఆఫీసుపై ఐటీ దాడులు
-
టీడీపీ నేత ఆఫీసుపై ఐటీ దాడులు
అనంతపురం: టీడీపీ నేత, కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబు ఆఫీసులో ఐటీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. కర్ణాటక నుంచి వచ్చిన ప్రత్యేక ఐటీ బృందం ఈ తనిఖీలు చేపట్టారు. అమిలినేని సురేంద్రబాబు ఆఫీసులో కొన్ని కీలక డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


