డీలిమిటేషన్‌కు పెరుగుతున్న మద్దతు | Delimitation heat intensifies in Delhi Politics | Sakshi
Sakshi News home page

డీలిమిటేషన్‌కు పెరుగుతున్న మద్దతు

Nov 28 2026 6:20 PM | Updated on Nov 28 2026 6:35 PM

Delimitation heat intensifies in Delhi Politics

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుపై రాజకీయ వేడి పెరుగుతోంది. ఈ బిల్లుకు మద్దతు ప్రకటిస్తున్న పార్టీల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇప్పటికే డీఎంకే, ఎన్సీపీ, బీఆర్ఎస్ పార్టీలు బిల్లుకు మద్దతు ప్రకటించాయి.

ఈ తాజా పరిణామాలతో ఎన్డీఏ బలం 350కి చేరింది. రేపు, ఎల్లుండి మరికొన్ని తటస్థ పార్టీలు కూడా బిల్లుకు మద్దతు ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ఇప్పటికే చర్చ జరుగుతోంది. అయితే ఎన్డీఏ ప్రభుత్వం కావాల్సిన మెజారిటీకి మరో పది సీట్ల దూరంలోనే ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక మరోవైపు.. డీలిమిటేషన్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరికి ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలు మద్దతు ఇవ్వడం లేదనే సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. దాంతో డీఎంకే, ఎన్సీపీ, బీఆర్ఎస్ పార్టీలపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది.

డీలిమిటేషన్ బిల్లు వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని, ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బిల్లుపై పార్లమెంట్‌లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి: తిరుప్పరంకుండ్రం కొండపై వెలిగిన దీపం.. 50 మంది భక్తులకే అనుమతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement