మదురై: తమిళనాడులోని మదురై తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య దీప ప్రజ్వలనం కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేవలం 50 మంది భక్తులకు మాత్రమే అధికారులు అనుమతి ఇచ్చారు.
తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో అధికారులు దీపం వెలిగించే కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ దీప ప్రజ్వలనం కార్యక్రమం ప్రశాంతంగా నిర్వహించారు.
ఇదీ చదవండి: ఎన్నికల ఏజెంట్‌గా ధర్మానకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్


