21 ఏళ్ల త‌ర్వాత ఒకే వేదికపై హరీశ్‌రావు, జగ్గారెడ్డి | Harish Rao and Jagga Reddy meet after 21 years | Sakshi
Sakshi News home page

21 ఏళ్ల త‌ర్వాత ఒకే వేదికపై హరీశ్‌రావు, జగ్గారెడ్డి

Nov 28 2026 3:34 PM | Updated on Nov 28 2026 3:48 PM

Harish Rao and Jagga Reddy meet after 21 years

సంగారెడ్డి:  కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తాజాగా ఒకే వేదికపై కలిశారు.  అయితే వీరిద్దరూ కలవడం 21 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచింది. అయితే రాజకీయ వేదిక కాదు..  ఓ పెళ్లి వేడుక. అది కూడా జగ్గారెడ్డి కుమారుని పెళ్లి వేడుక. దీనికి హరీష్‌రావును జగ్గారెడ్డి ఆహ్వానించడంతో వీరి కలయిక రెండు దశాబ్దాల తర్వాత అనివార్యమైంది.  జగ్గారెడ్డి కుమారుడు భరత్ సాయి రెడ్డి- కోడలు పాలక్ పటే‌ల్‌ను హరీశ్‌ ఆశీర్వదించారు. అదే సమయంలో హరీష్‌-జగ్గారెడ్డిలు కబుర్లు చెప్పుకుంటూ కాసేపు ఉల్లాసంగా కనిపించారు. 

అయితే తనకు హరీశ్‌తో ఉన్న పరిచయం, 21 ఏళ్ల తర్వాత జరిగిన కలయికపై జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ఇద్దరి మధ్య జరిగిన సమావేశంలో ఎలాంటి రాజకీయాలు, మతలబులు లేవని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

2004లో హరీశ్ రావు మంత్రిగా ఉన్న సమయంలో ఆయనతో కలిసి తన ఛాంబర్‌లో భోజనం చేసేవాడినని జగ్గారెడ్డి గుర్తుచేశారు. ఆ తర్వాత తాను కాంగ్రెస్‌లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు హరీశ్ రావును కలవలేదని తెలిపారు.

దాదాపు 21 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఓ కుటుంబ కార్యక్రమంలో ఇద్దరం మళ్లీ కలుసుకున్నామని చెప్పారు. తన కుమార్తె వివాహానికి హరీశ్ రావును ఆహ్వానించలేకపోయానని, అయితే ఈ కుటుంబ వేడుకకు మాత్రం ఆయనను ఆహ్వానించానని వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని హరీశ్ రావు మిస్ కావొద్దనే ఉద్దేశంతో పిలిచినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: డీలిమిటేషన్‌ బిల్లుకు బీఆర్‌ఎస్‌ మద్దతు: కేటీఆర్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement