ఎన్నికల నిర్వహణపై ఎస్పీ స్పష్టమైన హామీ ఇవ్వలేదు: సతీష్ రెడ్డి | YSRCP Leader Satish Reddy On Vempalli Gram Panchayat Elections | Sakshi
Sakshi News home page

ఎన్నికల నిర్వహణపై ఎస్పీ స్పష్టమైన హామీ ఇవ్వలేదు: సతీష్ రెడ్డి

Nov 28 2026 9:15 PM | Updated on Nov 28 2026 9:22 PM

YSRCP Leader Satish Reddy On Vempalli Gram Panchayat Elections

సాక్షి, వైఎస్సార్ జిల్లా: వేంపల్లి గ్రామపంచాయతీ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్‌ను కోరారు. సర్పంచ్ అభ్యర్థి షబ్బీర్ వలితో కలిసి ఆయన ఎస్పీని కలిశారు. ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా పులివెందుల నియోజకవర్గంలో గతంలో జరిగిన ఎన్నికల తీరును ఎస్పీకి వివరించారు. పోలీసులు తమను అడ్డుకుని నామినేషన్లు వేయకుండా చేశారని సతీష్ రెడ్డి ఆరోపించారు. వేంపల్లిలో భారీగా పోలీసులను మోహరించడంపై ప్రజల్లో అనేక అపోహలు, అనుమానాలు ఉన్నాయని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు.

అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారనే భావన ప్రజల్లో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. వేంపల్లిలో ఇంత పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు గతంలో ఎప్పుడూ చూడలేదని, చరిత్రలో ఇదే తొలిసారి అని పేర్కొన్నారు.

ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని ఎస్పీ స్పష్టమైన హామీ ఇవ్వలేదని సతీష్ రెడ్డి తెలిపారు. ‘చూస్తాం.. చేస్తాం.. పరిశీలిస్తాం’ అంటూ ఎస్పీ సమాధానం ఇచ్చారని వెల్లడించారు. వేంపల్లి ఎన్నికల్లో పోలీసులు తమ విధులను సక్రమంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కోరినట్లు చెప్పారు.

ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సతీష్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పాల్గొని ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: మహిళల చేతులు కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి రూ.3.20 కోట్లు చోరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement