దొంగ ఓట్ల కలకలం.. కైలే అనిల్‌తో ఎస్‌ఐ దురుసు ప్రవర్తన | SI Srinivas Over Action With YSRCP Anil Kumar At Pamarru | Sakshi
Sakshi News home page

దొంగ ఓట్ల కలకలం.. కైలే అనిల్‌తో ఎస్‌ఐ దురుసు ప్రవర్తన

Nov 29 2026 12:03 PM | Updated on Nov 29 2026 12:18 PM

SI Srinivas Over Action With YSRCP Anil Kumar At Pamarru

సాక్షి, కృష్ణా జిల్లా: పామర్రులో పోలింగ్‌ వేళ దొంగ ఓట్ల వ్యవహారం కలకలం రేపింది. తాము ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లగా.. ఇప్పటికే తమ ఓట్లు పోలయ్యాయని అధికారులు చెప్పడంతో ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. అసలు తాము ఓటు వేయకుండానే తమ ఓట్లు ఎలా పోలయ్యాయని ప్రశ్నించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఓటర్ల తరఫున ప్రశ్నించే ప్రయత్నం చేయడంలో పోలీసులు ఓవరాక్షన్‌కు దిగారు.

పామర్రులో పోలింగ్‌ వేళ దొంగ ఓట్ల విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఓటర్ల తరఫున ప్రశ్నించేందుకు పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన పట్ల పోలింగ్‌ ఏజెంట్లు దురుసుగా ప్రవర్తించారు. అలాగే, వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై టీడీపీ ఏజెంట్, పోలింగ్‌ సిబ్బంది దాడికి దిగాయి. పోలింగ్‌ కేంద్రంలో జరుగుతున్న పరిణామాలపై అనిల్ కుమార్ ప్రశ్నించగా పోలీసులు కూడా దురుసుగా వ్యవహరించినట్లు ఆరోపించారు. ఎస్‌ఐ శ్రీనివాస్‌ ఆయనను తోసివేసి దురుసుగా ప్రవర్తించడంతో ఉద్రి​క్తత చోటుచేసుకుంది. దీంతో, పోలీసుల తీరును ఖండిస్తూ కైలే అనిల్ కుమార్ ఆందోళనకు దిగారు.

చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యం..
మరోవైపు.. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రపురం మండలం సి.రామాపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామంలోని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు దాడులకు దిగారు. ఈ నేపథ్యంలో టీడీపీ వర్గీయులను వదిలేసి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. దీంతో, పోలీసుల తీరుపై వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును ప్రశ్నించిన మాజీ జడ్పీటీసీ భానుకుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఇదిలా ఉండగా.. వైఎస్సార్‌ జిల్లా చెన్నూరులోనూ పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్‌ బూత్‌ ప్రవేశ ద్వారం వద్ద టీడీపీ మద్దతుదారులు హల్‌చల్‌ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. టీడీపీకి ఓటు వేయాలంటూ ఓటర్లను ఏజెంట్లు బెదిరిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికలు.. టీడీపీ గూండాల అరాచకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement