రాయపాటి సాంబ శివరావు మృతి పట్ల వైఎస్‌ జగన్‌ సంతాపం | YS Jagan expresses condolences over the passing of Rayapati Samba Siva Rao | Sakshi
Sakshi News home page

రాయపాటి సాంబ శివరావు మృతి పట్ల వైఎస్‌ జగన్‌ సంతాపం

Nov 29 2026 3:02 PM | Updated on Nov 29 2026 3:11 PM

YS Jagan expresses condolences over the passing of Rayapati Samba Siva Rao

తాడేపల్లి: మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మృతిపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ‘‘ఆరుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై.. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రజలకు విశిష్ట సేవలందించారు. ప్రజా జీవితంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. రాయపాటి సాంబశివరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నా’’ అని వైఎస్ జగన్ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement