
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్‌లో చోటు చేసుకున్న పరిణామాలపై టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ స్పందించారు. హెచ్‌సీఏ అవినీతి సర్వసాధారణం అయ్యిందన్న ఆయన.. తాను ఆ విషయాన్ని పట్టించుకునే స్థితిలో లేనని అన్నారు. మంగళవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ..
‘‘రూల్స్ పాటించకపోతే ఇలాంటి కష్టాలే వస్తాయ్. హెచ్‌సీఏలో చాలా సమస్యలున్నాయ్. అసోషియేషన్ అనేది ఎప్పుడూ స్వలాభంతో నడవకూడదు. ఫోర్జరీ చేసినందుకే ప్రస్తుత ప్రెసిడెంట్ అరెస్ట్ అయ్యాడు. కాబట్టి, ఇప్పటివరకు జరిగిన అవకతవకలు బయటకి తీయాలి. హెచ్‌సీఏలో జరుగుతున్న పరిణామాలపై బీసీసీఐ ఫోకస్ పెట్టాలి.
హెచ్‌సీఏ సభ్యులు, కోచ్‌ల పిల్లలనే క్రికెట్ ఆడిస్తున్నారు. సెలక్టర్లలో కూడా అవినీతి ఉంది. మొత్తంగా అవినీతి అనేది కామన్‌గా మారింది. పార్టీ ఆదేశిస్తే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేస్తా. జూబ్లీహిల్స్ రేసులో నేను కూడా ఉన్నాను. హెచ్‌సీఏ కంటే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక లో పోటీ చేయడమే నా ముఖ్య లక్ష్యం’’ అని అజారుద్దీన్ కుండబద్ధలు కొట్టారు.