‘గ్రాడ్యుయేట్స్‌’పై బీజేపీ గురి | Sakshi
Sakshi News home page

‘గ్రాడ్యుయేట్స్‌’పై బీజేపీ గురి

Published Tue, May 21 2024 5:58 AM

BJP Focus On Graduate MLC By Election

ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విస్త్తృత ప్రచారం.. మోదీ ఇమేజ్‌ పనిచేస్తుందన్న భావనలో కమలదళం

సాక్షి, హైదరాబాద్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ దృష్టి సారించింది. ఈ నెల 27న జరగనున్న నల్లగొండ–వరంగల్‌–ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో గెలుపొంది సత్తా చాటాలనే సంకల్పంతో రాష్ట్ర నాయకత్వం ముందుకు సాగుతోంది. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఇప్పటికే మూడుజిల్లాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించగా, పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్‌ 3,4 రోజు లుగా మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో   కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్రచారంలో పాల్గొంటున్నారు. జహీరా బాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. 

ఇతర రాష్ట్రాల్లో పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్‌ త్వరలోనే ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో విస్తృత ప్రచారం నిర్వహించను న్నట్టు సమాచారం. గతంలో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ గెలుపొందిన అనుభవంతో పాటు విస్తృత పరిచ యాలు, ఎమ్మెల్సీ క్యాంపెయిన్‌కు సంబంధించి అవగాహన ఉన్న ఎన్‌.రామచందర్‌రావు ఈ ఎన్ని కకు పార్టీ తరఫున ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తు న్నారు. ప్రచారం ముమ్మరం చేశామని, ఈసారి గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయని ‘సాక్షి’కి ఆయన వెల్ల డించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలవడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని, పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని చెప్పారు. లోక్‌సభ ఎన్ని కల్లో పార్టీ పట్ల ఉన్న సానుకూలత తప్పకుండా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఉపయోగపడుతుందన్నారు. 

మంచి ఫలితం వస్తుంది: గుజ్జుల
రాష్ట్రపార్టీ నాయకత్వం, ముఖ్యనేతలు, వేలాది మంది కార్యకర్తల తోడ్పాటుతో మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ›ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. ఒక్కో పోలింగ్‌ బూత్‌ వారీగా మూడు, 4 బృందాలను ఏర్పాటు చేసి పార్టీనాయకులు, కార్య కర్తలు ఇంటింటికి వెళ్లి పట్టభద్ర ఓటర్లను కలుస్తు న్నారన్నారు. కోర్టులు, వాకర్స్‌ను కలుసుకో వడం, చిన్న చిన్నసమావేశాల నిర్వహణ ద్వారా ఓటర్స్‌ కాంటాక్ట్‌ ప్రోగ్రామ్‌ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. క్షేత్రస్థాయిలో ‘మోదీవేవ్‌’ స్పష్టంగా కనిపిస్తోందని, ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా గెలుపొందుతాననే నమ్మకం తనకు ఏర్పడిందని ధీమా వ్యక్తం చేశారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో పాటు రెండో ప్రాధాన్యత ఓటుపైనా ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement