
విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ఈసీ రద్దు చేసింది. హైకోర్టు ఆదేశాలతో ఉప ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
సాక్షి, ఢిల్లీ: విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ఈసీ రద్దు చేసింది. హైకోర్టు ఆదేశాలతో ఉప ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన క్రమంలో ఉపఎన్నిక నోటిఫికేషన్‌ను ఈసీ రద్దు చేసింది.