 
													బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఆపద మొక్కులు మొ క్కుతోందని గురువారం ఎక్స్ వేదికగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ఎన్నికలో గెలుపు కోసం సినీ కార్మికులకు అడ్డగోలు వాగ్దా నాలు చేయడం, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్‌ను కేబినెట్‌లోకి తీసుకోవడం, మంత్రు లు గతంలో ఎప్పుడూ లేని విధంగా హైదరాబాద్ వీధుల్లో హడావుడి చేయడం చూ స్తుంటే కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు తెలిసిపోతోందని అన్నారు.
అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు క్షేత్రస్థాయి వాస్తవాలను గ్రహి స్తున్నట్లు కనిపిస్తోందని, జూబ్లీహిల్స్‌లో డిపాజిట్ కోల్పోతేనే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయక త్వానికి గుణపాఠం చెప్పడానికి ఇదే సరైన సమయమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. 
 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
