శంషాబాద్: ఎయిర్‌హోస్టెస్‌తో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని ఆర్‌జీఐఏ ఔట్‌పోస్టు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. మూడు రోజుల కిందట దుబాయ్ నుంచి ఇండిగో విమానంలో వచ్చిన బాలకృష్ణన్ రమేష్ (58) అనే ప్రయాణికుడు మద్యం తాగుతూ ఎయిర్‌హోస్టెస్‌ను ఉద్దేశపూర్వకంగా చేతితో తగిలి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనిపై ఎయిర్‌లైన్స్ అధికారులు ఫిర్యాదు చేయడంతో ఆర్‌జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.


