సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఐబీ మాచీ చీఫ్ ప్రభాకర్‌రావు సిట్ విచారణ ఆరో రోజుకు చేరుకుంది. జూబ్లీహిల్స్‌లోని సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) SIT కార్యాలయంలో ఆయన విచారణ కొనసాగుతోంది. గత ఐదు రోజులుగా విచారణలో నోరు మెదపని ప్రభాకర్ రావు ఆరో రోజు కూడా సిట్ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా మాటలు దాటవేస్తూ అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ తరుణంలో..
సిట్ అధికారులు ప్రభాకర్ రావు కదలికలపై సీసీ కెమెరా నిఘా పెట్టారు. ప్రముఖుల ఫోన్ నంబర్లు మావోయిస్టుల ఖాతాలో పెట్టి రివ్యూ కమిటీ నుంచి ట్యాపింగ్‌కు అనుమతి పొందిన నేపథ్యంలో అలా ఎందుకు చేశారు? ప్రముఖుల ఫోన్ నంబర్లు పెట్టమని ఎవరైనా చెప్పారా? మీరే నిర్ణయం తీసుకున్నారా? మావోయిస్టుల పేరుతో రాజకీయ నాయకుల ఫోన్ నెంబర్లు పెట్టమని ఎవరు చెప్పారు? అని సిట్ ప్రశ్నిస్తోంది.
అయితే డేటా డిలీట్ పై పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో ఉన్న ఐఫోన్ లో క్లౌడ్ డేటా ఓపెన్ చేసినట్లు,ఫోన్ అమెరికాలో ఎందుకు వదిలేసి వచ్చినట్లు? అంటూ రాజకీయ ప్రముఖుల సీడీఆర్ డేటాతో ప్రభాకర్‌ని సిట్ ప్రశ్నించింది. ఎందుకు ట్రేస్ చేయాల్సి వచ్చింది. గత ప్రభుత్వ అమాత్యుల పాత్ర ఉందా? అని ప్రశ్నించగా ఆ మాటలు దాటవేస్తూ.. విచారణకు ప్రభాకర్ రావు ఇబ్బందులు పెడుతున్నట్టు సమాచారం. ప్రభాకర్ రావు 5ఐ క్లౌడ్, 5జిమెయిల్ ఖాతాల్లో ఉన్న డేటాపై సిట్ దర్యాప్తు చేసింది.
గతంలో నాలుగు జీమెయిల్ ఖాతాలు, ఐక్లౌడ్ 2 అకౌంటల పాస్‌వర్డ్ ఇవ్వడంతో డేటా కనిపించకుండా ఉండటంతో సిట్ వాటిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కి పంపింది. దానితో సిట్ ఎఫ్‌ఎస్‌ఎల్ డేటా ఆధారంగా ప్రశ్నిస్తున్నట్టు. మరోవైపు సింక్ అయిన డేటా యాపిల్, జిమెయిల్ కంపెనీల నుండి సిట్ అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. ఆ డేటాతో పాటు విచారణలో ప్రభాకర్ నోరు మెదిపితే కీలకమైన ఆధారాలు సిట్‌కు లభించనున్నాయి. అయితే తన వ్యక్తిగత సమాచారం మాత్రమే డివైస్ నుండి తొలిగించానని ప్రభాకర్ రావు సిట్‌కు తెలిపారు.ప్రభాకర్ రావు వాగ్మూలంపై వాస్తవం ఎంత అనేది జీమెయిల్,యాపిల్ కంపెనీల డేటాతో ముడిపడి ఉంది.


