హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన నేపథ్యంలో ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఆయా రోజుల్లో హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ వై జంక్షన్– బొల్లారం చెక్‌పోస్టు, కౌకూరు రోడ్డు, రిసాల బజార్, లక్డావాలా – అల్వాల్ టీ జంక్షన్, లోతుకుంట లాల్ బజార్, హోలీ ఫ్యామిలీ జంక్షన్, తిరుమలగిరి ఎక్స్ రోడ్డు– కార్ఖానా తదితర మార్గాల్లో నిరీ్ణత సమయాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు.


