స్టాలిన్‌ పోటీ చేయరా? | Stalin says no decision yet on contesting in bypoll | Sakshi
Sakshi News home page

స్టాలిన్‌ పోటీ చేయరా?

Jun 28 2026 8:34 AM | Updated on Jun 28 2026 10:38 AM

Stalin says no decision yet on contesting in bypoll

సాక్షి, చెన్నై : ఉప ఎన్నికల్లో తిరుచ్చి తూర్పు నియోజకవర్గం నుంచి డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ పోటీ చేసే అవకాశాలు లేవని ఆ పార్టీ సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. పార్టీ ప్రధాన ప్రతి పక్ష నేతగా అసెంబ్లీలో యువకుడైన ఉదయనిధి స్టాలిన్‌ సభలో చక్కగా రాణిస్తున్నారని పేర్కొంటున్నారు.

 స్టాలిన్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టిన పక్షంలో ఉదయనిధి చేతిలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేత పదవి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని, ఈ దృష్ట్యా, స్టాలిన్‌ ఉప ఎన్నికలకు దూరంగా ఉండేందుకే మొగ్గు చూపు తున్నట్టు తెలిసింది. తిరుచ్చి తూర్పు నియోజకవర్గంలో స్టాలిన్‌ పోటీ చేస్తారని గత రెండు మూడు రోజులుగా తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కేఎన్‌ నెహ్రూ సైతం వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన స్టాలిన్‌ ఎలాంటి నిర్ణ యం తీసుకోలేదని స్పష్టం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement