
న్యూఢిల్లీ: కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి పేరును బీజేపీ ప్రకటించింది. నవ్య హరిదాస్ ఇక్కడి నుంచి తమ పార్టీ తరపున బరిలో ఉంటారని వెల్లడించింది. నవ్య కేరళ బీజేపీ మహిళామోర్చాకు ప్రధానకార్యదర్శిగా ఉన్నారు. వయనాడ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ పార్టీ అగ్రనేత ప్రియాంకా గాంధీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ రాజీనామాతో వయనాడ్‌కు ఉప ఎన్నిక వచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి గెలిచిన రాహుల్‌గాంధీ వయనాడ్‌ను వదులుకుని ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. నవంబర్ 13న వయనాడ్ ఎంపీ సీటుకు ఉప ఎన్నిక జరగనుంది.
ఇదీ చదవండి: జార్ఖండ్‌లో కాంగ్రెస్,జేఎంఎం మధ్య కుదిరిన పొత్తు