ఉప ఎన్నికల్లో సత్తా చాటుతాం: టీటీవీ దినకరన్‌

We face By elections Said By TTV Dinakaran - Sakshi

చెన్నై: ఉప ఎన్నికలను ఎదుర్కొనేందుకు  సిద్ధంగా ఉన్నామని అమ్మ మక్కల్‌ మున్నేట్ర కజగం(ఏఎంఎంకే) పార్టీ అధ్యక్షుడు టీటీవీ దినకరన్‌ స్పష్టం చేశారు. అనర్హతకు గురైన ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్లబోమని వెల్లడించారు. రాబోయే ఉప ఎన్నికల్లో మా సత్తా చాటి ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని వ్యాఖ్యానించారు.

టీటీవీ దినకరన్‌ వర్గానికి చెందిన 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు  తమిళనాడు సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా గ్రూపు కట్టడంతో స్పీకర్‌ వారిపై అనర్హత వేటు వేశారు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు హైకోర్టులో వారికి చుక్కెదురైంది. అనర్హత సబబేనని హైకోర్టు తీర్పునివ్వడంతో సుప్రీంకోర్టుకు వెళ్లడానికి టీటీవీ దినకరన్‌ వర్గీయులు సంశయించారు. ఉప ఎన్నికలలోనే తేల్చుకోవాలని నిశ్చయించుకున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top