
హైదరాబాద్: నగర పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ గడువు ముగిసింది. ఈ మధ్యాహ్నం 3 గంటల వరకు వచ్చిన అభ్యర్థులను లోనికి అనుమతించారు అధికారులు. ఈరోజు(మంగళవారం, అక్టోబర్ 21వ తేదీ) నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఆర్వో కార్యాలయం కాంపౌండ్‌క భారీగా క్యూకట్టారు స్వతంత్ర్య అభ్యర్థులు. సుమారు వందకు పైగా స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ వేసినట్ల తెలుస్తోంది.
గేట్ లోపల ఉన్న అభ్యర్థుల నామినేషన్లన మాత్రమే ఆర్వో అధికారి స్వీకరించనున్నారు. గడిచిన 9 రోజుల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని(Deepak Reddy) సైతం ఈరోజే నామినేషన్ దాఖలు చేశారు.
కాగా, ఊహించిన విధంగా దీపక్ రెడ్డి వైపే.. బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. గత బుధవారం ఉదయం దీపక్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించింది. ఇక, దీపక్ రెడ్డి.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచే పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో దీపక్‌రెడ్డికి 25వేల ఓట్లు వచ్చాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలు చాలా సీరియస్‌గా తీసుకున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పక్కా ప్రణాళికలు చేస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికలోనూ పార్టీలు ఆచితూచి అడుగులు వేశాయి. ఇక, ఈ ఎన్నికలో అధికార కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, బీఆర్‌ఎస్ తరఫున మాగంటి సునీత గోపీనాథ్ బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో త్రిముఖ పోరు ఉండనుంది.

ఇదీ చదవండి
పార్టీలో నా న్థానం ఏమిటి..?