
సాక్షి, జగిత్యాల జిల్లా: తనను హలాల్ చేసి రోజుకింత ఎందుకు చంపేస్తున్నారంటూ మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఒకేసారి చంపండంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముందు జీవన్‌రెడ్డి వాపోయారు. బీఆర్‌పూర్ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీపై జీవన్‌రెడ్డి అసంతృప్తి చేశారు. కమిటీలు, కాంట్రాక్టులు బీఆర్‌ఎస్ నుంచి వచ్చినవారికే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో తమ స్థానమేంటని ప్రశ్నించారు.
తాము వలసదారులం కాదంటూ తాజాగా పార్టీలోకి చేరి పదవులనుభవిస్తున్న వారిపై చురకలు అంటించారు. మంత్రి శ్రీధర్‌బాబు, అడ్లూరి అడుకోకపోతే ఆ రోజే కథ వేరుండేదంటూ అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కౌలుదారులం కాదు.. పట్టాదారులమంటూ జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. జీవన్‌రెడ్డి ఆవేదనను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.