అహ్మదాబాద్‌కు మదీనా విమానం మళ్లింపు
సురక్షితంగా ల్యాండైన షార్జా విమానం
శంషాబాద్ (హైదరాబాద్): శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కావల్సిన రెండు వేర్వేరు విమానాలను బాంబులతో పేల్చివేస్తామని ఆర్‌జీఐఏ కస్టమర్ సపోర్ట్‌కు వచి్చన మెయిల్స్ భద్రతాధికారులను ఉరుకులు పరుగులు పెట్టించాయి. ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపిన వివరాలివి. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు మదీనా నుంచి బయలుదేరిన ఇండిగో 6ఈ వి మానం ఉదయం 8 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కావల్సి ఉంది.
ఉదయం 5 గంటలకు ఆర్‌జీఐఏ కస్టమర్ సపోర్ట్‌కు వచ్చిన మెయిల్‌లో.. మదీనా విమానం శంషాబాద్ ఎ యిర్‌పోర్టులో ల్యాండ్ అవుతున్నప్పుడు మానవ బాంబుతో పేల్చివేస్తామని హెచ్చరించారు. దీంతో అధికారులు మార్గమధ్యలో ఉన్న మదీనా వి మానాన్ని అహ్మదాబాద్ విమానాశ్రయానికి మళ్లించి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
మధ్యా హ్నం 2 గంటల సమయంలో మరోమారు ఆర్‌జీఐఏ కస్టమర్ సపోర్ట్‌కు 6ఈ–1422 షార్జా నుంచి వచ్చే విమానాన్ని బాంబుతో పేల్చివేయనున్నట్లు మెయిల్ రావ డంతో.. అధికారులు వెంటనే బాంబు థ్రెట్ అసెస్‌మెంట్ కమిటీ ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎట్టకేలకు విమానం 3.10 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలోనే సురక్షితంగా ల్యాండైంది. ఈ మేరకు జీఎంఆర్ భద్రతాధికారులు ఆర్‌జీఐఏ ఔట్‌పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


