ములుగు జిల్లా: మేడారం జాతర సందర్భంగా టీజీ ఎస్‌ఆర్‌టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. అయితే నిర్ధారించిన స్థానం నుంచి గమ్య స్థానం వరకు ఒకే ధర నిర్ణయించారు. దీంతో ప్రయాణికులు బస్సు ఎక్కిన ప్రదేశం నుంచి దిగే స్థానం వరకు మధ్యలో ఎక్కడ దిగినా టికెట్‌కు మొత్తం ధర చెల్లించాల్సి వస్తోంది. ఉదాహరణకు ఏటూరునాగారం– వెంకటాపురం(కె) మేడారం స్పెషల్ బస్సు ఏటూరునాగారంలో ఎక్కి వాజేడు మండలంలోని ఏ గ్రామంలో దిగినా వెంకటాపురం(కె) చార్జీ చెల్లించాల్సి వస్తోంది.
సాధారణం ఈ రెండు ప్రాంతాల మధ్య చార్జీ రూ.30 ఉంటుంది. కానీ రూ.100 వసూలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు ఇంత చార్జీ ఎలా చెల్లించాలని కండక్టర్‌ను నిలదీస్తున్నారు. ఈ కొద్ది దూరానికే ఇంత చార్జీ ఎలా చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు. అయితే కండక్టర్ మాత్రం తామ చేసేది ఏమీ లేదని పైనుంచే చార్జీలు నిర్ధారణ అయి వచ్చాయని చెబుతున్నారు.


