సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్‌లోని ఆరాంఘర్ చౌరస్తాలో తెలంగాణ ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. సంక్రాంతి పండుగ దృష్ట్యా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ట్రావెల్స్, ప్రైవేటు బస్సుల్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫిట్‌నెస్‌లేని ఐదు బస్సులపై కేసులు నమోదు చేశారు.
హైదరాబాద్ నుంచి కేరళ, బెంగళూరు, తమిళనాడు, పాండిచ్చేరిలతో పాటు ఏపీకి వెళ్తున్న బస్సులను అధికారులు తనిఖీ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఉప రవాణా శాఖ అధికారి సదానందం ఆదేశాల మేరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలిపారు. ఆర్టీఏ తనిఖీలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


