జాబితాలో 43 మంది ఐఏఎస్..
మరో ఇద్దరు నాన్ ఐఏఎస్ అధికారులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 43 మంది ఐఏఎస్, మరో ఇద్దరు నాన్ ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఫార్ములా ఈ–కార్ రేసు కేసులో నిందితుడిగా ఉన్న విపత్తుల నిర్వహణ శాఖ (రెవెన్యూ శాఖలో భాగం) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరి్వంద్‌కుమార్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో ఆయన్ను బాధ్యతల నుంచి తప్పించిన ప్రభుత్వం తదుపరి పోస్టింగ్ కేటాయించలేదు. ఆ శాఖ అదనపు బాధ్యతలను కార్మీక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దానకిశోర్‌కు అప్పగించింది.
దేవాదాయ శాఖలో బదిలీల వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు వచి్చన నేపథ్యంలో ఆ శాఖ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతల నుంచి ఎస్.హరీశ్‌ను ప్రభుత్వం తప్పించింది. ఇటీవల ఆరోపణలు రావడంతో తెలంగాణ మెడికల్ సర్విసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఎంఎస్‌ఐడీసీ) ఎండీ జి.ఫణింద్రారెడ్డిని నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా బదిలీ చేసింది. టీజీఎంఎస్‌ఐడీ ఎండీగా అదనపు బాధ్యతలను గౌరవ్ ఉప్పల్‌కు అప్పగించింది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా విస్తృత సవరణ (ఎస్‌ఐఆర్)తో పాటు జనగణన–2027 కింద గృహాల గణన ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాలు ప్రారంభమైతే ముగిసే వరకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో సంబంధిత కార్యక్రమాలను పర్యవేక్షించే అధికారుల బదిలీలపై నిషేధం అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో అంతకు ముందే భారీ సంఖ్యలో ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసినట్టు తెలుస్తోంది.
ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు ఇలా.. (బ్రాకెట్‌లో ఉన్నవి.. బదిలీ అయిన స్థానం, అదనపు బాధ్యతలు)
⇒ సంజయ్‌కుమార్ – పరిశ్రమలుఐటీశాఖ స్పెషల్ సీఎస్ (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ స్పెషల్ సీఎస్)
⇒ సబ్యసాచి ఘోష్ – ప్రతిష్టాత్మక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల యూనిట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ప్రతిష్టాత్మక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల యూనిట్, సీఎస్‌ఆర్ విభాగ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి)
⇒ అరవింద్‌కుమార్– విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (నో పోస్టింగ్)
⇒ ఎన్.శ్రీధర్ – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్యకార్యదర్శి (పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి, గనుల శాఖ ముఖ్యకార్యదర్శి – అదనం)
⇒ రాహుల్ బొజ్జా– నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి(సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి, బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి–అదనం)
⇒ ఈ.శ్రీధర్ – సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి, నీటిపారుదల శాఖ కార్యదర్శి (బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి– అదనం)
⇒ గౌరవ్ ఉప్పల్ – తెలంగాణ భవన్ కార్యదర్శి, (ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శి, టీజీఆర్‌ఏసీ ఈఓ, డీజీ, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ– అదనం)
⇒బి.విజేంద్ర – మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ కార్యదర్శి, ఎస్సీల అభివృద్ధి శాఖ కమిషనర్)
⇒పి.కాత్యాయినిదేవి – ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారి (రాష్ట్ర ఆర్థిక సంఘం జేఎండీ)
⇒అద్వైత్‌కుమార్ సింగ్ – మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ (తెలంగాణ భవన్ ప్రత్యేక కార్యదర్శి)
⇒ఎం.హనుమంతరావు – యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్ ( దేవాదాయ శాఖ డైరెక్టర్, గోదావరి పుష్కరాల ప్రత్యేకాధికారి– అదనం)
⇒ఎం.సిక్తా పట్నాయక్ – నారాయణపేట జిల్లా కలెక్టర్ (ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి)
⇒సందీప్‌కుమార్ ఝా – జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ (కుత్బుల్లాపూర్) (జనగామ జిల్లా కలెక్టర్)
⇒ఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ – టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ (మూడో డిస్కం(కొత్తది) సీఎండీ)
⇒పమేల సత్పతి – కరీంనగర్ జిల్లా కలెక్టర్ (కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్)
⇒అనురాగ్ జయంతి– జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ (రాజేంద్రనగర్) (యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్)
⇒రాహుల్ రాజ్ – మెదక్ జిల్లా కలెక్టర్ (సహకార శాఖ ప్రత్యేక కమిషనర్, సహకార సొసైటీల రిజిస్ట్రార్)
⇒భవేశ్ మిశ్రా – ఐటీ శాఖ ఉప కార్యదర్శి (ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శి)
⇒జితేశ్ వి.పాటిల్ – భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ (టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ)
⇒రిజ్వాన్ బాషా షేక్ – జనగామ జిల్లా కలెక్టర్ (జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్)
⇒సంతోశ్ బీఎం – జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ (గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్)
⇒ప్రతీక్ జైన్ – వికారాబాద్ జిల్లా కలెక్టర్ (నారాయణపేట జిల్లా కలెక్టర్)
⇒స్నేహ షబరీశ్ – హనుమకొండ జిల్లా కలెక్టర్ (మహబూబాబాద్ జిల్లా కలెక్టర్)
⇒జి.ఫణీంద్రారెడ్డి – టీజీ ఎంఎస్‌ఐడీసీ ఎండీ (నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్) (స్థానిక)
⇒చిత్ర మిశ్రా – ఐటీడీఏ ఏటూరునాగారం పీఓ (కరీంనగర్ జిల్లా కలెక్టర్)
⇒గరీమ అగర్వాల్ – రాజన్న సిరిసిల్ల అదనపు కలెక్టర్ (స్థానిక) (రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్)
⇒దీపక్ తివారి – ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక) (వికారాబాద్ జిల్లా కలెక్టర్)
⇒ప్రతిమాసింగ్ – రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక) (మెదక్ జిల్లా కలెక్టర్)
⇒అంకిత్ – నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక) (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్)
⇒చాహత్ బాజ్‌పాయ్ – గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ (హనుమకొండ జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్) (అదనపు)
⇒ఖుష్బు గుప్తా – ఐటీడీఏ ఏటూరునాగారం పీఓ (మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్)
⇒మంద మకరందు – సీసీఎల్‌ఏలో ప్రాజెక్టు డైరెక్టర్ (సీఎంఆర్‌ఓ) (రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్) (జీహెచ్‌ఎంసీ)
⇒ఫైజాన్ అహమ్మద్ – నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక) (మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా అదనపు కలెక్టర్) (స్థానిక)
⇒శివేంద్ర ప్రతాప్ – మహబూబ్‌నగర్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక) (హైదరాబాద్ మెట్రో రైల్ జేఎండీ)
⇒పర్మార్ పింకేశ్‌కుమార్ లలిత్‌కుమార్ – జనగామ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక) (కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్) (జీహెచ్‌ఎంసీ)
⇒ఉమాశంకర్ ప్రసాద్ – తాండూరు (వికారాబాద్) సబ్ కలెక్టర్ (వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్) (స్థానిక)
⇒జీవీ శ్యాంప్రసాద్‌లాల్ – ఎంజేపీ టీజీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ సంయుక్త కార్యదర్శి (నాగర్‌కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్) (స్థానిక)
⇒పి.చంద్రయ్య – మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) (మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్) (స్థానిక)
⇒వైవీ గణేష్ – వరంగల్ భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ (వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్)(స్థానిక)
⇒ అబ్దుల్ హమీద్ – సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) (సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్) (స్థానిక)
⇒ బి.వెంకటేశ్వర్లు – కరీంనగర్ జిల్లా రెవెన్యూ అధికారి (నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్) (స్థానిక)
⇒ ఎన్.ఖీమానాయక్ – వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) (వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్) (స్థానిక)
⇒ కె.విద్యాసాగర్ – సీఎస్‌కు ఓఎస్డీ (పరిశ్రమలు, పెట్టుబడుల సెల్, స్పీడ్ విభాగ అదనపు సీఈఓ)
⇒ ఎం.సురేందర్ – సహకార సొసైటీల అదనపు రిజిస్ట్రార్ (ప్రజావాణి అదనపు నోడల్ అధికారి)
⇒ వీరికి అదనపు బాధ్యతలు అప్పగింత: ఎం.దానకిశోర్ – కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ, కర్మాగారాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి)
⇒ డి.దివ్య – సెర్ప్ సీఈఓ (ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారి)


