‘లోన్‌యాప్’బెదిరింపులకు వ్యక్తి ఆత్మహత్య
ఘట్‌కేసర్: లోన్‌యాప్ నిర్వాహ కుల బ్లాక్‌మెయిల్‌కు భయపడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఘట్‌కేసర్ లోని రాంనగర్‌కు చెందిన సాయికుమార్ (35) ఓలా ఆటో నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆర్థిక సమస్యలు వెంటాడడంతో భార్య పేరు మీద ఓ లోన్‌యాప్‌లో రుణం తీసు కున్నాడు.
గడువు లోపల లోన్ చెల్లించాలని యాప్ నిర్వాహకులు ఒత్తిడి చేయసాగారు. అ యినా లోన్ చెల్లించకపోవడంతో ఆమె ఫొటో లు ఆన్‌లైన్, సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్‌మెయిల్ చేయడంతో ఒత్తిడికి లోనయ్యా డు. బెదిరింపులు భరించలేక మనస్తాపం చెంది గురువారం ఉదయం కొండాపూర్ రెవెన్యూ పరిధిలోని ప్రభాకర్ ఎన్‌క్లేవ్‌లో ఓ వేప చెట్టుకు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మా ర్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కు టుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


