
సాక్షి,హైదరాబాద్: జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై బీజేపీలో ట్విస్ట్ చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా, మాజీ మేయర్ కాంగ్రెస్ ఉపాధ‍్యక్షుడు బొంతు రామ్మోహన్ పేరును ఎంపీ అర్వింద్ ప్రతిపాదించారు. బొంతు రామ్మోహన్‌ను పార్టీలోకి తీసుకుని టికెట్ ఇవ్వాలని.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావుకు ఎంపీ అర్వింద్ విజ్ఞప్తి చేశారు. బొంతు రామ్మోహన్‌కు ఏబీవీపీ బ్యాక్‌గ్రౌండ్ ఉందని తెలిపారు.
అర్వింద్ చేసిన ప్రతిపాదనపై బీజేపీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. జూబ్లీహిల్స్ అభ్యర్థిని ఖరారు చేసేందుకు బీజేపీ ఇప్పటికే త్రిసభ్య కమిటీని నియమించింది. మాజీ ఎంపీ పోతుగంటి రాములు, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, సీనియర్ నేత కోమల ఆంజనేయులుతో కూడిన కమిటీ ఇప్పటికే నియోజకవర్గ నేతలతో సుధీర్ఘంగా చర్చించి వారి అభిప్రాయాలు సేకరించింది.