గోబెల్స్‌కు గురువు మన చంద్రబాబే: వైఎస్‌ జగన్‌ | Ys Jagan Fires On Chandrababu Lies On Super Six | Sakshi
Sakshi News home page

గోబెల్స్‌కు గురువు మన చంద్రబాబే: వైఎస్‌ జగన్‌

Dec 4 2025 12:05 PM | Updated on Dec 4 2025 12:28 PM

Ys Jagan Fires On Chandrababu Lies On Super Six

సాక్షి, తాడేపల్లి: సూపర్‌ సిక్స్‌ ఇచ్చేశామంటూ నిసిగ్గుగా చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. సూపర్‌-6,7 సూపర్‌హిట్‌ అని ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసింది గాడిదలను కాయడానికా? అంటూ మండిపడ్డారు. రైతులకు కూటమి ఇచ్చిన ప్రతిమాట అబద్ధమన్న వైఎస్‌ జగన్‌.. ఉచిత బస్సు ప్రయాణం కొంతమందికే, కొన్ని బస్సులు పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సూపర్‌-6,7 సూపర్‌హిట్‌ అని ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రబాబు నుంచి గోబెల్స్‌ పాఠాలు నేర్చుకోవాలి. గోబెల్స్‌కు చంద్రబాబే టీచర్‌’’ అంటూ వైఎస్‌ జగన్‌ చురకలు అంటించారు. ‘‘నిరుద్యోగ భృతి కింద రూ.3 వేలు ఇస్తామన్నారు. ఏమైంది?. రెండేళ్లలో ఒక్కొక్కరికి రూ. 72 వేలు ఇవ్వాలి ఏమైంది?. ఆడబిడ్డ నిధి కింద ప్రతినెలా రూ. 1500 ఇస్తామన్నారు. రెండేళ్లలో రూ.18 వేలు ఇవ్వాలి.. ఇచ్చారా?. బీసీలకు 50ఏళ్లకే  పెన్షన్‌ అన్నారు.. ఇచ్చారా?. చంద్రబాబు ఈ-క్రాప్‌ వ్యవస్థను భ్రష్టుపట్టించారు’’ అంటూ వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement