సాక్షి, తాడేపల్లి: చిన్నారుల జీవితాలను చంద్రబాబు ఛిద్రం చేస్తున్నారంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రభుత్వ హాస్టళ్లలో కలుషిత తాగునీరు, కలుషిత ఆహారం కారణంగా అనారోగ్యంతో 29 మంది పిల్లలు చనిపోయారని ఆయన నిప్పులు చెరిగారు. వందలాది విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారని.. కూటమి ప్రభుత్వానికి మాయరోగం వచ్చిందని వైఎస్ జగన్ దుయ్యబటారు.
‘‘ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేశారు. నాడు-నేడును పూర్తిగా ఆపేశారు. ఇంగ్లీష్ మీడియాన్ని తీసేశారు. స్కూల్‌లో డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు 7100 కోట్లు. నేటి తరం ఆస్తి చదువు. పిల్లలను చదివించడానికి బాబు ముందుకు రావడం లేదు’’ అని వైఎస్ జగన్ నిలదీశారు.


