సాక్షి, తాడేపల్లి: ఇండియన్ నేవీ డే సందర్భంగా.. దేశ నౌకాదళ సిబ్బందికి వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘మన సముద్ర తీరాలను కాపాడటంలో నౌకాదళ సిబ్బంది పాత్ర అసమానమైనది. దేశ ప్రయోజనాలను కాపాడేందుకు.. సముద్రాలపై వారు చూపుతున్న ధైర్యం, దృఢ సంకల్పానికి అభినందనలు అంటూ ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారాయన.
దేశానికి నౌకా దళాల విజయాలు, దేశ రక్షణలో వారి పాత్రను గుర్తుచేసుకొవటానికి ప్రతీ ఏటా డిసెంబర్ 4వ తేదీని నేవీ డేగా జరుపుతారు. తీర ప్రాంతాల్లో నేవీ ప్రత్యేక విన్యాసాలు నిర్వహిస్తారు.
Warmest wishes to the Navy personnel on Indian Navy Day. Their role in protecting our shores is unparalleled. Hats off to our Navy personnel for their courage and determination on the high seas as they pursue the Nation’s interests.#IndianNavyDay
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 4, 2025
మరి ఈ తేదీనే ఎందుకంటే.. 1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో డిసెంబరు 4న భారత నేవీ అతిపెద్ద పాకిస్తానీ నౌకాశ్రయం కరాచీ పోర్టుపై మెరుపుదాడి చేసి మూడు ఓడలను ముంచేసింది. ఆపరేషన్ ట్రైడెంట్‌గా ఇది చరిత్రలో నిలిచిపోయింది. అందుకే.. ఆ తేదీ జ్ఞాపకార్ధంగా భారతదేశంలో నేవీ డే నిర్వహిస్తుంటారు.


