గణపవరం పీహెచ్‌సీలో ఆరోగ్యశాఖ కమిషనర్
నాదెండ్ల: గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ సందర్శించారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో ఆయన రాగా, అప్పటికే సిబ్బంది వెళ్లిపోయి పీహెచ్‌సీకి తాళాలు వేసి ఉన్నాయి. పరిసరాలు పరిశీలించి ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. విషయం తెలుసుకున్న ‘సాక్షి’ కమిషనర్‌తో మాట్లాడగా, సాధారణ పర్యటనలో భాగంగా గణపవరం పీహెచ్‌సీకి వచ్చినట్లు తెలిపారు.
అమరావతి: శ్రీమత్ హనుమత్ వ్రతాన్ని పురస్కరించుకుని బుధవారం ప్రసిద్ధ శైవక్షేత్రమైన అమరావతి అమరేశ్వరాలయంలోని ప్రసన్నాంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు, తమలపాకులతో పూజలు, హనుమాన్ చాలీసా పారాయణం చేసి వడ మాలలు సమర్పించారు. తొలుత ఆలయ అర్చకుడు పరుచూరి కేశవా చార్యులు స్వామి వారికి పంచామృత స్నపన, సహస్ర నామాలతో తమలపాకుల పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.
తాడికొండ: సీఆర్డీఏ అధికారులు మంగళవారం ఎన్‌టీఆర్ జిల్లాలోని అక్రమ లే అవుట్లను ధ్వంసం చేశారు. విజయవాడ రూరల్ మండలం పాతపాడులోని సర్వే నెంబర్ 114లో 5.50 ఎకరాల భూమిలో అనధికారిక లే అవుట్, సర్వే నెంబర్ 145లోని 1.20 ఎకరాల భూమిలో అనధికారిక లే అవుట్లను ధ్వంసం చేశారు. సీఆర్డీఏ పరిధిలో అనధికారిక లే అవుట్‌లను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమన్నారు.
మంగళగిరి టౌన్ : బెటాలియన్ అభివృద్ధిలో సిబ్బంది పాత్ర ప్రధానంగా ఉందని, గతంలో కంటే బెటాలియన్ అభివృద్ధి చెందిందని 6వ బెటాలియన్ ఏపీఎస్‌పీ కమాండెంట్ కె.నగేష్‌బాబు పేర్కొన్నారు. మంగళగిరి నగర పరిధిలోని శ్రీరామ్‌నగర్ కాలనీలోని ఆధునికీకరించి ఏపీఎస్‌పీ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. అసోసియేషన్ నాయకులు కమాండెంట్ నగేష్‌బాబు, అసిస్టెంట్ కమాండెంట్ ఆశీర్వాదంలను శాలువ, పూలమాలలతో సత్కరించారు.
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): ఆంధ్రప్రదేశ్ వార్డు శానిటేషన్, ఎన్విరాన్మెంట్ సెక్రటరీలకు వారి లైన్ డిపార్ట్‌మెంట్లలో, విద్య అర్హతల ఆధారంగా ఇతర ప్రభుత్వ శాఖల్లో ప్రమోషన్ కల్పించాలని కోరుతూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చింతల రాజ్‌కుమార్ కోరారు. ఈ మేరకు బుధవారం మంగళగిరిలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగులు అందరికి న్యాయం జరిగే విధంగా చూడాలని కోరారు.
గణపవరం పీహెచ్‌సీలో ఆరోగ్యశాఖ కమిషనర్
గణపవరం పీహెచ్‌సీలో ఆరోగ్యశాఖ కమిషనర్


