గుంటూరు
న్యూస్‌రీల్
గురువారం శ్రీ 4 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
చైర్‌పర్సన్ వైఖరితో ఉమ్మడి గుంటూరు జిల్లాలో కుంటుపడుతున్న అభివృద్ధి
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 3881 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. నిల్వ 42.1600 టీఎంసీలు.
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 579.50 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 15,445 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
తాడేపల్లి రూరల్: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని తాడేపల్లి సీతానగరానికి సంబంధించిన 14వ నెంబర్ సచివాలయంలో పింఛను పంపిణీ చేసేందుకు తీసుకువచ్చిన నగదులో కొంత మాయమైన సంఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల ప్రకారం... సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ ఆదివారం సెలవు కావడంతో శనివారం బ్యాంకు నుంచి సీతానగరంలోని పలు ప్రాంతాల్లో పింఛన్లు పంచేందుకు రూ.20 లక్షలు విత్‌డ్రా చేసి తీసుకువచ్చారు. అదేరోజు నగదును టేబుల్‌పై పేర్చి అక్కడ సిబ్బందికి ప్రాంతాలవారీగా నగదు పంచుతున్న సమయంలో రూ.40 వేలు మాయమైంది. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ సంఘటనపై తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పింఛను ఆపకుండా వెల్ఫేర్ అసిస్టెంట్ నగదు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎంటీఎంసీ అధికారులు మాత్రం నగదు ఎవరి దగ్గర పోయాయో వారే చెల్లించాలని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.
గుంటూరు మెడికల్: జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు అవుతున్న దృష్ట్యా ప్రజలు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి బుధవారం మీడియాకు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఈ వ్యాధికి చికిత్స చేసేందుకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. శరీరంపై నల్ల మచ్చలతో కూడిన దద్దు, జ్వరం, తలనొప్పి, వణుకు, కండరాల నొప్పులు లాంటి లక్షణాలు వ్యాధి సోకిన వారిలో కనిపిస్తాయన్నారు. సకాలంలో వ్యాధిని గుర్తించకపోతే శ్వాస సంబంధిత వ్యాధులకు దారితీస్తుందని వెల్లడించారు. పైన పేర్కొన్న వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే, దగ్గరలోని ఆరోగ్య సిబ్బందిని గాని , ఆరోగ్య కేంద్రాన్ని గాని సందర్శించి చికిత్స తీసుకోవాలని చెప్పారు. ఆరోగ్య కేంద్రాలలో వ్యాధికి సంబంధించిన చికిత్స అందుబాటులో ఉందన్నారు. వ్యాధి నిర్ధారణ రక్త పరీక్ష గుంటూరు జీజీహెచ్‌లో మాత్రమే అందుబాటులో ఉందని( ఐజీఎమ్ ఎలీసా), ఆందోళన అవసరం లేదన్నారు.
గుంటూరు ఎడ్యుకేషన్: జెడ్పీ చైర్‌పర్సన్, టీడీపీ ప్రజాప్రతినిధుల తీరుతో జెడ్పీటీసీలు ఏళ్ల తరబడి పనులు చేయలేకపోవడం వల్ల ప్రజల్లో చెడ్డపేరు వస్తోంది. మరో వైపు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫార్సులకు పెద్దపీట వేసి జెడ్పీతోపాటు కేంద్ర నిధుల్లోనూ వారికే ప్రాధాన్యత ఇవ్వడంతో జెడ్పీటీసీలు ప్రేక్షకపాత్రకు పరిమితం అవుతున్నారు. మూడు నెలలకోసారి కొలువుదీరే స్టాండింగ్, జనరల్ బాడీ సమావేశాలకు హాజరై అజెండాల ఆమోదానికి పరిమితమవుతున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధుల సిఫార్సులకే ప్రాధ్యాన్యత ఇస్తూ చైర్‌పర్సన్ సాగిస్తున్న ఏకపక్ష విధానాలకు నిరసనగా వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు సమావేశాలను అడ్డుకుంటున్నారు. గతంలో సర్వసభ్య సమావేశాన్ని మూకుమ్మడిగా బహిష్కరించిన జెడ్పీటీసీలు గత నెల 26న ఏర్పాటు చేసిన స్థాయీ సంఘ సమావేశాలను బహిష్కరించారు. కీలకమైన ప్రణాళిక, ఆర్థిక అంశాలతో కూడిన సమావేశాల అజెండాలను తిరస్కరించడం ద్వారా జెడ్పీలో ఏకపక్ష వైఖరిపై యుద్ధం ప్రకటించారు.
ప్రచ్ఛన్న యుద్ధం
జెడ్పీలో చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినాకు, వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జెడ్పీటీసీగా గెలిచాక చైర్‌పర్సన్ పీఠాన్ని అధిష్టించి, రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ మారిన హెనీ క్రిస్టినా వైఖరితో జెడ్పీటీసీలు తీవ్రంగా విభేదిస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తమ మండలాల్లో పనులు కేటాయించకుండా వ్యవహరిస్తున్న తీరును సహించలేక పోరుకు సిద్ధమయ్యారు.
ఎవరితోనూ పనిలేకుండానే...
జెడ్పీ వార్షిక బడ్జెట్‌లో ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి పనులకు 2025–26 బడ్జెట్‌లోనే కేటాయింపులు పూర్తయ్యాయి. జెడ్పీకి వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయంతోపాటు 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన బకాయిలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సర నిధులకు సైతం పనులు కేటాయించేశారు. పరిస్థితి ఈ విధంగా ఉండగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి పనులకు జెడ్పీ చైర్‌పర్సన్‌కు సిఫార్సులు పంపడం, వాటిని చైర్‌పర్సన్ వెంటనే ఆమోదించేయడం పరిపాటిగా మారింది. జెడ్పీటీసీలతో చర్చించకుండా నేరుగా స్టాండింగ్ కమిటీ, అక్కడి నుంచి జనరల్ బాడీ సమావేశాల అజెండాల్లో పొందుపర్చి ఆమోదింపచేసుకుంటున్నారు. స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో ప్రవేశపెట్టిన అజెండాపై సభ్యులతో చర్చించి, వారి నుంచి అభిప్రాయాలు తీసుకోవడానికి భిన్నంగా కోరం అయిందా, లేదా అని చూసి ఆమోదించేస్తున్నారు.
టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సులతో..
జెడ్పీటీసీలకు తెలియకుండా టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సులతో చైర్‌పర్సన్ పెద్ద సంఖ్యలో కేటాయింపులు జరిపేశారు. వీటిలో కొన్నింటిని పరిశీలిస్తే... వేమూరు ఎమ్మెల్యే ప్రతిపాదనలతో రూ.29.30 లక్షలు, నరసరావుపేట ఎమ్మెల్యే సిఫార్సులతో రూ.20 లక్షలు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రతిపాదనలతో రూ.30 లక్షలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాదనలతో అత్యధికంగా రూ.కోటి పనులకు ముందస్తు అనుమతులు ఇచ్చేశారు. ఈ విధంగా రూ.30 కోట్ల మేరకు ముందస్తు అనుమతులతో పనులు కేటాయించడంతో భగ్గుమన్న జెడ్పీటీసీలు వాటిని అడ్డుకున్నారు.
7
ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. ఆదాయ మార్గాలను పెంచుకోవడంలో విఫలం కావడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్లు తెచ్చుకోవడంలో నిర్లక్ష్యం కారణంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పడకేస్తోంది.
ప్రజల ఓట్లతో గెలిచి, పాలకవర్గంలో భాగస్వాములుగా ఉన్న జెడ్పీటీసీ సభ్యులను పక్కనపెట్టి జెడ్పీని
వాడుకుంటున్న పాలకుల తీరుతో
జిల్లా ప్రజా పరిషత్ పేరు, ప్రఖ్యాతులు మసకబారుతున్నాయి.
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు


