జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలు.. గెలిచేది ఆ పార్టీనే? | Jubilee Hills By Election Exit Poll Live Updates | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలు.. గెలిచేది ఆ పార్టీనే?

Nov 11 2025 6:54 PM | Updated on Nov 11 2025 8:53 PM

Jubilee Hills By Election Exit Poll Live Updates

సాక్షి,హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలో విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఓటర్లు కాంగ్రెస్‌కు పట్టం కట్టినట్లు తెలుస్తోంది. 

పీపుల్స్‌ పల్స్‌ -కాంగ్రెస్ 48శాతం,బీఆర్‌ఎస్-41శాతం,బీజేపీ-6శాతం

చాణక్య స్ట్రాటజీస్‌- కాంగ్రెస్-46శాతం,బీఆర్‌ఎస్‌-43శాతం,బీజేపీ-6శాతం‌‌‌ 

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నవంబర్ 11న ఉదయం 7 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఈ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సంఘం 407 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్‌ నిర్వహించింది.

ఈ ఎన్నికల్లో మొత్తం 58 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా..బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఈ రేసులో ముందంజలో ఉన్నారు. కాగా, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల ఫలితాలు నవంబర్‌ 14 (శుక్రవారం) విడుదల కానున్నాయి. 

ఇదీ చదవండి: 

ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement