న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో డ్రగ్స్ దందా, విదేశీయుల అక్రమ వలసలపై పోలీసు బలగాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి ఆఫ్రికా దేశాలకు చెందిన 260 మందిని అదుపులోకి తీసుకున్నాయి. ఆదివారం ద్వారక, బిందాపూర్, డబ్రి, ఉత్తమ్ నగర్, మోహన్ గార్డెన్, తిలక్ నగర్, నిహాల్ విహార్‌లను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో చేపట్టిన ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’సందర్భంగా ఎలాంటి పత్రాలు లేని, గడువు దాటిన విదేశీయులను ప్రధానంగా లక్ష్యంగా చేసుకున్నట్లు జాయింట్ పోలీస్ కమిషనర్(పశ్చమ రేంజ్) జతిన్ నర్వాల్ చెప్పారు. ఒక్క ద్వారకలోనే మహిళలు, చిన్నారులు సహా 20 మంది పట్టుబడ్డారన్నారు.
చదవండి: లగ్జరీ అపార్ట్‌మెంట్ : గోడకు పెన్సిల్‌తో రంధ్రం?! వైరల్ వీడియో
ఎలాంటి అనుమతి పత్రాలు లేని, వీరివద్ద డ్రగ్స్ కూడా దొరికాయన్నారు. ఎక్కువగా నైజీరియన్లే ఉన్నారన్నారు. వీరితోపాటు ఐవరీ కోస్ట్, సెనెగల్, సియెర్రా లియోన్, కామెరూన్, ఉగాండా, కెన్యా, జింబాబ్బే, ఘనా దేశాలకు చెందిన వారు కూడా పట్టుబడ్డట్లు చెప్పా రు. చట్టపరమైన ఎలాంటి నిబంధనలను పాటించకుండా విదేశీయులకు ఇళ్లను అద్దెకు ఇచ్చిన యజమానులను సైతం నిర్బంధంలోకి తీసుకున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: 100 ఎకరాల ఫామ్ హౌస్, లగ్జరీ కార్లు : కళ్లు చెదిరే సంపద


