ఆకాశ దేశంలో వెలుగుల పండుగ. ధ్రువాల తరచూ కనువిందు చేసే వెలుగులు (అరోరా)లు ఈసారి మరీ అందంగా వెలుగొందాయి. కింద పెద్ద నగరాల తాలూకు విద్యుద్దీప కాంతులు, పైన అందరి గెలాక్సీ నుంచి పడ్డ వెలుగులు కలగలిసి అరోరాల అందాన్ని ద్విగుణీకృతం చేశాయి. దాంతో అవి కాస్తా, ఇదుగో... ఇలా విస్మయం కలిగించేలా వింత శోభ సంతరించుకున్నాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి నాసా సైంటిస్టు డాన్ పెటిట్ వాటిని ఇలా అద్భుతంగా కెమెరా కంటితో బంధించి పంపారు!
అరోరాలు. ఒక్క మాటలో చెప్పాలంటే ధ్రువకాంతులు. సూర్య కిరణాలతో సంయోగం చెందిన పై వాతావరణ పొరలోని అణువులు వాయు సంసర్గం పొందితే ఏర్పడే ఉంటా కాంతులు. ఆకుపచ్చ, ఊదాతో పాటు చిక్కని ఎరుపు రంగుల్లో మెరిసిపోవడం వీటి ప్రత్యేకత. సంవత్సరాంతంలో ఉత్తర ధ్రువం వద్ద ఆరోరాల సందడి కొత్తేమీ కాదు. కానీ అవి అంతరిక్ష వెలుగులతో కలగలిసి ఇలా కొత్త హొయలు పోవడమే చాలా అరుదు.
శీతాకాలం అరోరాల్లో పెద్ద నగరాల తాలూకు దీప కాంతులు అరోరాలతో కలగలసి కనిపించడం అరుదు కాదు. కాకపోతే భూమికి ఏకంగా 25 లక్షల కాంతి సంవత్సరాల దూరంలోని ఆ్రన్డోమెడ గెలాక్సీ తాలూకు శోభ కూడా పెటిట్ ఫోటోల్లో నేపథ్యంలో కనిపిస్తోంది. ఈ విశేషం అందరి ఆకర్షిస్తోంది. పెటిట్ కూడా వీటిని ’బెస్ట్ హాలిడే లైట్స్’గా వరి్ణంచారు. సరిగ్గా క్రిస్మస్, న్యూ ఇయర్ నడుమ వెలుగు చూసిన ఈ ఇమేజీలు పండుగ వాతావరణానికి మరింత వన్నె తెచ్చాయి.


