ప్రపంచంలో ఎలాంటి మీడియా లేదు.... ఎలాంటి రికార్డింగ్ లేదు....కానీ ఒక మాట అందరి నోటా ఉంది. మనం space-time(కాల కొలమానం) ను adjust చేసి... టైం ట్రావెల్ చేయొచ్చా? అంటే.... మనం కాలాన్ని సెట్ చేసి... గతంలోకి లేదా భవిష్యత్తులోకి వెళ్లగలమా? , గణాంకాల ప్రకారం... సిద్ధాంతపరంగా ఒక వస్తువును లేదా వస్తువులను 99.9999% కాంతివేగం వరకు తీసుకెళితే time dilation(కాల వ్యత్యాసం) జరుగుతుంది....కాలం నెమ్మదిస్తుంది.... ఆ స్పీడ్‌లో టైం ట్రావెల్ సాధ్యమే కానీ.. అక్కడి వరకు వెళ్లడం ప్రస్తుతానికి అసాధ్యమే అని చెప్పవచ్చు. భవిష్యత్తులో సాధ్యం కావచ్చు కూడా...
19వ శతాబ్ధం వరకు మన పూర్వీకుల గురించి మనం విన్నామే తప్ప వారి దినచర్యలు... కార్యకలాపాలు... వారి అసలు రూపాలు మనం చూడలేదు. ఆ తర్వాత క్రమేణా విగ్రహాలు... రాతి బొమ్మలు... ఆ తర్వాత కెమెరా... ఫోటోలు.. వీడియోలు వచ్చేశాయి. అంతకు ముందు వారికి దీని గురించి తెలియదు. ఇక 21వ శతాబ్ధంలో అధునాతన టెక్నాలజీ రావడంతో ప్రతి విషయం రికార్డెడ్‌గా మారింది. అంటే భవిష్యత్ తరాల వారికి మనం ఇప్పడు జీవిస్తున్న తీరు... మన చర్యలు.. మనకు సంబంధించి ప్రతి విషయం తెలిసే అవకాశం ఉందనడంలో సందేహం లేదు.
అంటే ఇప్పటి తరం గతంలోకి వెళ్లలేకపోయినా... రాబోయే తరాలు సోషల్ మీడియా ద్వారా భూతకాలంలోకి వెళ్లి చూసే అవకాశముంది. ఇది వినడానికి అంత వింతగా కనిపించకున్నా... భవిష్యత్తులో మాత్రం ఎన్నో ప్రయోగాలకు మూలం కానుంది. అయితే టైమ్ ట్రావెల్ కూడా ఇలాంటిదే అని చెప్పవచ్చు...
Time travel ఒక science fiction మాత్రమే అయితే.... CERNలో శాస్త్రవేత్తలు వెదుకుతున్నదేంటీ? , Time travel అసాధ్యం అయితే.... 13 బిలియన్ డాలర్లు వెచ్చించి Large Hadron Collider ఎందుకు నిర్మించారు? , వాస్తవంగా కాలం కన్నా ముందు... కాలానికి వెనక్కి మనం ప్రయాణించడానికి ఆస్కారం లేకుంటే 150 ఏళ్ల నుంచి సాగుతున్న పరిశోధనల సారం ఏంటీ?, పరిశోధనలకు అనుగుణంగా కాంతి వేగానికి సమాన వేగంతో ప్రయాణించే సాధనాల సంసిద్ధత అవసరముందని శాస్త్రవేత్తలు ఎందుకు చెప్పారు.
Laser ring తో time machine ఎందుకు తయారు చేసి ప్రయోగించారు. ఇప్పటికీ అలాంటి కొన్ని వేల ప్రయోగాలు కొనసాగుతున్నాయి. దీంతో మనకు అర్థం అయ్యేదేమిటంటే.... Time travel వెంటనే కాకున్నా.... మరి కొన్ని పరిశోధనల తర్వాత... రాబోయే తరాల సాంకేతికతతో సాధ్యమయ్యే అవకాశముంది. టైమ్ ట్రావెల్ సాధ్యమే అని 2017లో Stephen Hawking అన్నాడు.
సాంకేతికత కాకుండా... వాస్తవికతతో పరిశీలిస్తే...
ప్రతి రాత్రి మనం నిద్రపోతే.... నిద్రలో కలల్లో భవిష్యత్తును కూడా చూస్తుంటాం... ఊహకందని విషయాలు... వింతలు చూసి తిరిగి వర్తమానంలో మేల్కొంటాం. ఇది ఓ రకమైన టైం ట్రావెల్ అని చెప్పవచ్చు.
కలలో పెద్ద పెద్ద పనులు కొన్ని సెకన్లలో జరుగుతున్నట్లు అనిపిస్తుంది... కానీ మేల్కొన్న తర్వాత అసాధ్యమనిపిస్తుంది. అంటే మనం నిద్ర పోయి time travel చేస్తున్నట్టే కదా? ప్రతి రాత్రి మన ఆత్మ వేరే dimension లోకి వెళ్తుంది, అక్కడి కాలం వేరేలా ఉంటుంది. తిరిగి మన ప్రపంచంలో మేల్కొంటాం.
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ 1905లో రిలేటివిటీ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. రిలేటివిటి సిద్దాంతం కూడా కాలానికి సంబంధించి కచ్చితత్వం లేదని చెప్పారు.
ఇంటర్ స్టెల్లార్ సినిమాలో మాథ్యూ మెక్ కానవే పాత్ర black hole దగ్గర ఒక గ్రహంపై ఒక గంట గడుపుతుంది.... కానీ భూమిపై 23 సంవత్సరాలు గడుస్తాయి. ఇది కాల వ్యత్యాస ఉదాహరణగా చెప్పవచ్చు.
టైమ్ ట్రావెల్ కోసం speed of light(కాంతి వేగం) కంటే ఎక్కువ వేగం కావాలి. కానీ mass(ద్రవ్య పరిమాణం) ఉన్న ఏ వస్తువూ శక్తి లేకుండానే speed of light చేరలేదు... అది చేరాలంటే infinite energy అవసరం అని... శాస్త్రవేత్తలు చెప్పారు. Einstein తో పాటు Nathan Rosen కూడా worm holes(సిద్ధాంతాత్మక మార్గం) గురించి చెప్పారు.
Worm holes... space-timeలో shortcuts కావచ్చు. అంటే రెండు దూర ప్రాంతాలను కలిపే ఓ పైపు లేదా సొరంగం లాంటి చర్య అని చెప్పవచ్చు. ఒక stable wormhole కోసం Milky Way galaxy మొత్తం mass కంటే ఎక్కువ energy కావాలి. ఆ ఎనర్జీ ఉంటే టైం ట్రావెల్ సాధ్యమే అని చెప్పవచ్చు. కానీ ఎనర్జీ ఏకీకృతం చేయడానికి ఇంకా సమయం పట్టవచ్చు.
1974లో Frank Tipler అనే శాస్త్రవేత్త.... rotating cylinder concept(భ్రమించే సిలిండర్ సూత్రం) ఇచ్చాడు. Infinite density.... length తో cylinder space-time ను curve చేస్తుంది. అంటే కాలం భవిష్యత్తు... భూతకాలం... వర్తమానానికి తిరుగుతుందని ఓ సూత్రం చెప్పారు. అయితే దానిపై అంతగా ఫోకస్ జరగలేదు.
2001లో Ronald Mallett అనే ఆయన laser beams తో space-time twist చేయడం ప్రతిపాదించాడు. Research ఇంకా కొనసాగుతోంది... ఫలితం ఇంకా రాలేదు.
CERN లో particles ను 99.99% speed of light వద్ద collide చేస్తారు. Time dilation( కాల వ్యత్యాసం) జరుగుతుంది, particleకి సంబంధించిన lifetime పెరుగుతుంది. మనుషుల కోసం ఇది practical కాదు.... కేవలం spiritual మాత్రమే. ఎందుకంటే టైమ్ ట్రావెల్ శక్తి ప్రస్తుతం మనుషులకు అసాధ్యమే అని చెప్పవచ్చు. కానీ భవిష్యత్తులో మాత్రం సాధ్యమని భావిద్దాం.


