Time Travel Theory
-
గతానికి, భవిష్యత్‌కి వెళ్లగలమా?
ప్రపంచంలో ఎలాంటి మీడియా లేదు.... ఎలాంటి రికార్డింగ్ లేదు....కానీ ఒక మాట అందరి నోటా ఉంది. మనం space-time(కాల కొలమానం) ను adjust చేసి... టైం ట్రావెల్ చేయొచ్చా? అంటే.... మనం కాలాన్ని సెట్ చేసి... గతంలోకి లేదా భవిష్యత్తులోకి వెళ్లగలమా? , గణాంకాల ప్రకారం... సిద్ధాంతపరంగా ఒక వస్తువును లేదా వస్తువులను 99.9999% కాంతివేగం వరకు తీసుకెళితే time dilation(కాల వ్యత్యాసం) జరుగుతుంది....కాలం నెమ్మదిస్తుంది.... ఆ స్పీడ్‌లో టైం ట్రావెల్ సాధ్యమే కానీ.. అక్కడి వరకు వెళ్లడం ప్రస్తుతానికి అసాధ్యమే అని చెప్పవచ్చు. భవిష్యత్తులో సాధ్యం కావచ్చు కూడా... 19వ శతాబ్ధం వరకు మన పూర్వీకుల గురించి మనం విన్నామే తప్ప వారి దినచర్యలు... కార్యకలాపాలు... వారి అసలు రూపాలు మనం చూడలేదు. ఆ తర్వాత క్రమేణా విగ్రహాలు... రాతి బొమ్మలు... ఆ తర్వాత కెమెరా... ఫోటోలు.. వీడియోలు వచ్చేశాయి. అంతకు ముందు వారికి దీని గురించి తెలియదు. ఇక 21వ శతాబ్ధంలో అధునాతన టెక్నాలజీ రావడంతో ప్రతి విషయం రికార్డెడ్‌గా మారింది. అంటే భవిష్యత్ తరాల వారికి మనం ఇప్పడు జీవిస్తున్న తీరు... మన చర్యలు.. మనకు సంబంధించి ప్రతి విషయం తెలిసే అవకాశం ఉందనడంలో సందేహం లేదు. అంటే ఇప్పటి తరం గతంలోకి వెళ్లలేకపోయినా... రాబోయే తరాలు సోషల్ మీడియా ద్వారా భూతకాలంలోకి వెళ్లి చూసే అవకాశముంది. ఇది వినడానికి అంత వింతగా కనిపించకున్నా... భవిష్యత్తులో మాత్రం ఎన్నో ప్రయోగాలకు మూలం కానుంది. అయితే టైమ్ ట్రావెల్ కూడా ఇలాంటిదే అని చెప్పవచ్చు... Time travel ఒక science fiction మాత్రమే అయితే.... CERNలో శాస్త్రవేత్తలు వెదుకుతున్నదేంటీ? , Time travel అసాధ్యం అయితే.... 13 బిలియన్ డాలర్లు వెచ్చించి Large Hadron Collider ఎందుకు నిర్మించారు? , వాస్తవంగా కాలం కన్నా ముందు... కాలానికి వెనక్కి మనం ప్రయాణించడానికి ఆస్కారం లేకుంటే 150 ఏళ్ల నుంచి సాగుతున్న పరిశోధనల సారం ఏంటీ?, పరిశోధనలకు అనుగుణంగా కాంతి వేగానికి సమాన వేగంతో ప్రయాణించే సాధనాల సంసిద్ధత అవసరముందని శాస్త్రవేత్తలు ఎందుకు చెప్పారు.Laser ring తో time machine ఎందుకు తయారు చేసి ప్రయోగించారు. ఇప్పటికీ అలాంటి కొన్ని వేల ప్రయోగాలు కొనసాగుతున్నాయి. దీంతో మనకు అర్థం అయ్యేదేమిటంటే.... Time travel వెంటనే కాకున్నా.... మరి కొన్ని పరిశోధనల తర్వాత... రాబోయే తరాల సాంకేతికతతో సాధ్యమయ్యే అవకాశముంది. టైమ్ ట్రావెల్ సాధ్యమే అని 2017లో Stephen Hawking అన్నాడు. సాంకేతికత కాకుండా... వాస్తవికతతో పరిశీలిస్తే... ప్రతి రాత్రి మనం నిద్రపోతే.... నిద్రలో కలల్లో భవిష్యత్తును కూడా చూస్తుంటాం... ఊహకందని విషయాలు... వింతలు చూసి తిరిగి వర్తమానంలో మేల్కొంటాం. ఇది ఓ రకమైన టైం ట్రావెల్ అని చెప్పవచ్చు. కలలో పెద్ద పెద్ద పనులు కొన్ని సెకన్లలో జరుగుతున్నట్లు అనిపిస్తుంది... కానీ మేల్కొన్న తర్వాత అసాధ్యమనిపిస్తుంది. అంటే మనం నిద్ర పోయి time travel చేస్తున్నట్టే కదా? ప్రతి రాత్రి మన ఆత్మ వేరే dimension లోకి వెళ్తుంది, అక్కడి కాలం వేరేలా ఉంటుంది. తిరిగి మన ప్రపంచంలో మేల్కొంటాం.ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ 1905లో రిలేటివిటీ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. రిలేటివిటి సిద్దాంతం కూడా కాలానికి సంబంధించి కచ్చితత్వం లేదని చెప్పారు. ఇంటర్ స్టెల్లార్ సినిమాలో మాథ్యూ మెక్ కానవే పాత్ర black hole దగ్గర ఒక గ్రహంపై ఒక గంట గడుపుతుంది.... కానీ భూమిపై 23 సంవత్సరాలు గడుస్తాయి. ఇది కాల వ్యత్యాస ఉదాహరణగా చెప్పవచ్చు. టైమ్ ట్రావెల్ కోసం speed of light(కాంతి వేగం) కంటే ఎక్కువ వేగం కావాలి. కానీ mass(ద్రవ్య పరిమాణం) ఉన్న ఏ వస్తువూ శక్తి లేకుండానే speed of light చేరలేదు... అది చేరాలంటే infinite energy అవసరం అని... శాస్త్రవేత్తలు చెప్పారు. Einstein తో పాటు Nathan Rosen కూడా worm holes(సిద్ధాంతాత్మక మార్గం) గురించి చెప్పారు. Worm holes... space-timeలో shortcuts కావచ్చు. అంటే రెండు దూర ప్రాంతాలను కలిపే ఓ పైపు లేదా సొరంగం లాంటి చర్య అని చెప్పవచ్చు. ఒక stable wormhole కోసం Milky Way galaxy మొత్తం mass కంటే ఎక్కువ energy కావాలి. ఆ ఎనర్జీ ఉంటే టైం ట్రావెల్ సాధ్యమే అని చెప్పవచ్చు. కానీ ఎనర్జీ ఏకీకృతం చేయడానికి ఇంకా సమయం పట్టవచ్చు. 1974లో Frank Tipler అనే శాస్త్రవేత్త.... rotating cylinder concept(భ్రమించే సిలిండర్ సూత్రం) ఇచ్చాడు. Infinite density.... length తో cylinder space-time ను curve చేస్తుంది. అంటే కాలం భవిష్యత్తు... భూతకాలం... వర్తమానానికి తిరుగుతుందని ఓ సూత్రం చెప్పారు. అయితే దానిపై అంతగా ఫోకస్ జరగలేదు. 2001లో Ronald Mallett అనే ఆయన laser beams తో space-time twist చేయడం ప్రతిపాదించాడు. Research ఇంకా కొనసాగుతోంది... ఫలితం ఇంకా రాలేదు. CERN లో particles ను 99.99% speed of light వద్ద collide చేస్తారు. Time dilation( కాల వ్యత్యాసం) జరుగుతుంది, particleకి సంబంధించిన lifetime పెరుగుతుంది. మనుషుల కోసం ఇది practical కాదు.... కేవలం spiritual మాత్రమే. ఎందుకంటే టైమ్ ట్రావెల్ శక్తి ప్రస్తుతం మనుషులకు అసాధ్యమే అని చెప్పవచ్చు. కానీ భవిష్యత్తులో మాత్రం సాధ్యమని భావిద్దాం. -
గతంలోకి వెళ్లాలనుందా..? ఈ సినిమాలు చూసేయండి..
Telugu Time Travel Movies And Web Series: భారతీయ సినీ ప్రపంచంలో అనేక రకాల సినిమాలు వచ్చాయి. అందులో ఎన్నో రకాల జోనర్లు ఉన్నాయి. అది ఏ జోనరైనా సరే ఆ జోనర్‌కు తగినట్టు చూపిస్తే చాలనుకుంటాడు సగటు సినీ ప్రేమికుడు. అలా ప్రేక్షకులు నచ్చే మెచ్చే జోనర్లలో ఒకటి 'టైమ్ ట్రావెల్' జోనర్. కాలంతో పాటు ప్రయాణం చేసే కథలు చాలా అరుదుగానే వస్తుంటాయి. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సినిమాలు చేయడం అంటే అంతా ఆశామాషీ కాదు. దానికి అద్భుతమైన స్క్రిప్ట్, బోలెడంత బడ్జెట్‌తో పాటు ప్రేక్షకుడిని కన్విన్స్ చేసేలా కూడా ఉండాలి. అందుకే చాలా తక్కువ మంది దర్శకులు మాత్రమే ఈ టైమ్ ట్రావెల్ కథలతో సినిమాలు చేశారు. నందమూరి బాలకృష్ణ నటించిన 'ఆదిత్య 369' నుంచి ఇటీవల వచ్చిన అద్భుతం సినిమా వరకు అలరించిన టైమ్ ట్రావెల్ చిత్రాలను చూద్దాం. 1 - ఆదిత్య 369 నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఆదిత్య 369 చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలోనే తొలి టైమ్ ట్రావెల్ చిత్రం. ఇందులో కృష్ణ కుమార్, శ్రీ కృష్ణదేవరాయలుగా రెండు పాత్రల్లో బాలకృష్ణ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆగస్టు 18, 1991లో విడుదలైన ఈ సినిమాకు సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను హాలీవుడ్ చిత్రం 'బ్యాక్ టూ ఫ్యూచర్', హెచ్.జి. వెల్స్ రచించిన 'టైమ్ మేషీన్' పుస్తకం నుంచి స్ఫూర్తి పొంది తెరకెక్కించారు. 2 - 24 తమిళ స్టార్ హీరో సూర్య మూడు విభన్న పాత్రలతో మెప్పించిన చిత్రం 24. ఈ సినిమాను వైవిధ్య చిత్రాల దర్శకుడు కె. విక్రమ్ కుమార్ తెరకెక్కించారు. సమంత హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో వాచ్ రిపేరర్, సైంటిస్ట్, విలన్‌గా సూర్య అదరగొట్టారు. ఇందులో వాచ్ రూపంలో టైమ్ మేషీన్ ఉంటుంది. ఆ వాచ్‌ను రిపేర్ చేసే క్రమంలో టైమ్ మేషీన్ ద్వారా సూర్య గతంలోకి ప్రవేశిస్తాడు. 3- ప్లే బ్యాక్ గతం నుంచి ప్రస్తుతానికి ఒక ఫోన్ లైన్ ద్వారా కనెక్షన్ ఏర్పడితే ఎలా ఉంటుందనేదే 'ప్లే బ్యాక్' సినిమా. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ వద్ద పనిచేసిన హరిప్రసాద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో దినేష్, అనన్య ప్రధానపాత్రల్లో నటించారు. వీరిలో ఒకరు 1993లో బ్రతికుంటే, మరొకరు 2019 కాలంలో జీవిస్తూ ఉంటారు. అయితే 26 ఏళ్ల టైమ్ గ్యాప్ ఉన్న ఈ పాత్రల మధ్య సంబంధం ఏంటీ ? ఫోన్ కాల్స్ ద్వారా గతంలో జరిగిన సంఘటనలో మార్పు తీసుకొస్తే ప్రస్తుతం, భవిష్యత్తులో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో అని తెలిపేదే కథ. ఈ సినిమా ప్రస్తుతం 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 4 - అద్భుతం తేజ సజ్జా, శివాని రాజశేఖర్ లీడ్ రోల్స్‌లో మాలిక్ రామ్ దర్శకత్వం వహించిన చిత్రం అద్భుతం. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న ఇద్దరు ఒక ఫోన్ కాల్‌తో విరమించుకుంటారు. అయితే ఇద్దరికీ ఒకే మొబైల్ నంబర్‌తో ఫోన్ కాల్ వస్తుండంతో ఆశ్చర్యానికి గురవుతారు. ఇలా ప్రారంభమైన సినిమా వాళ్లిద్దరూ వేరు వేరు సంవత్సరంలో జీవిస్తున్నారని తెలుస్తుంది. ఫ్లాష్ బ్యాక్ మూవీలో 26 సంవత్సరాలు టైమ్ గ్యాప్ ఉంటే ఇందులో ఐదేళ్ల గ్యాప్ ఉంటుంది. గతంలో జరిగిన సంఘటనలను మార్చే నేపథ్యంతో సాగుతుందీ సినిమా. ఈ చిత్రం నవంబర్ 19, 2021లో హాట్‌స్టార్‌లో విడుదలైంది. 5 - ఆ ! దర్శకుడిగా ప్రశాంత్ వర్మ తొలి చిత్రం ఆ !. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని హీరో నాని, ప్రశాంత్ తిపిర్నేని నిర్మించారు. ఇందులో కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, ఈషా రెబ్బ, రెజీనా కసాండ్ర, శ్రీనివాస్ అవసరాల, ప్రియ దర్శిని, మురళి శర్మ నటించగా, రెండు పాత్రలకు నాని, రవితేజ వాయిస్ ఇచ్చారు. అయితే ఈ సినిమా పూర్తి తరహా టైమ్ ట్రావెల్ చిత్రం కాదు. కానీ ఇందులో వాచ్మెన్ శివ పాత్ర సైంటిస్ట్ అవ్వాలనుకుంటాడు. సైంటిస్ట్ అయి టైమ్ మేషీన్ కనిపెట్టి ఎప్పుడూ చూడని తన తల్లిదండ్రులను కలవాలనుకుంటాడు. ఈ క్రమంలో అతని దగ్గరికి భవిష్యత్తు నుంచి పార్వతి అనే పాత్ర వస్తుంది. ఇలా ఈ పాత్రల ద్వారా టైమ్ ట్రావెల్‌ను చూపించాడు దర్శకుడు. అయితే పార్వతికి, శివకు ఉన్న రిలేషన్ ఏంటనేది మాత్రం సినిమాలో బెస్ట్ ట్విస్ట్. 6 - కుడి ఎడమైతే టైమ్ ట్రావెల్ జోనర్లో వచ్చిన వెబ్ సిరీస్ కుడి ఎడమైతే. అమలాపాల్, ఈశ్వర్ రచిరాజు, రాహుల్ విజయ్ నటించిన ఈ వెబ్ సిరీస్‌లో టైమ్ లూప్ (Time Loop) గురించి వివరించారు. ఒకే సమయంలో ఆగిపోవడం. అంటే పాత్రలు, సంభాషణలు, సంఘటనలు రిపీట్ అవుతుంటాయన్నమాట. మల్టీపుల్ స్క్రీన్ ప్లే, కొత్త తరహా కథతో ఆకట్టుకున్నాడు దర్శకుడు పవన్ కుమార్. -
80 ఏళ్ల క్రితమే స్మార్ట్ ఫోన్?
న్యూఢిల్లీ: స్మార్ట్ ఫోన్.. చేతిలో లేనిదే ఇప్పుడు ఎవరి జీవితం గడవటం లేదు. కమ్యూనికేషన్ దగ్గరి నుంచి ప్రపంచంలో ఏమూలలో అయినా జరిగే అరచేతిలోనే క్షణాల్లో తెలుసుకుంటున్నారు. అయితే గత దశాబ్ద కాలంగా ఇవి మనకు అందుబాటులోకి వచ్చాయని చెప్పుకుంటున్నప్పటికీ, ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సుమారు 80 ఏళ్ల క్రితమే స్మార్ట్ ఫోన్లు ఉన్నాయంటూ ఓ అమెరికన్ పెయింటింగ్ నిరూపిస్తోంది. ఉంబెర్టో రొమానో అనే చిత్రకారుడు 1937 లో ఓ మురల్(గోడ మీద పెయింటింగ్) ను గీశారు. దాని పేరు ‘మిస్టర్ పించోన్ అండ్ ది సెట్టింగ్ ఆఫ్ స్ప్రింగ్ ఫీల్డ్’.. ఇప్పుడు మనం మస్సాచుసెట్ట్స్ పట్టణంగా చెప్పకుంటున్న ప్రాంతంను నిర్మాణకర్త అయిన విలియం పించోన్ గుర్తుగా గీయబడిందే ఈ ఆర్ట్. ఆ చిత్రాన్ని గమనిస్తే పించోన్(పింక్ రంగు సూట్)కు ఎడమ వైపుగా ఓ రెడ్‌ఇండియన్ తెగకు చెందిన వ్యక్తి సెల్ఫీ దిగినట్లు ఉంది. దీంతో 80 ఏళ్ల క్రితమే స్మార్ట్ ఫోన్లు ఉన్నాయంటూ మదర్బోర్డ్ అనే ఓ మాగ్జైన్ ఆర్టికల్ ప్రచురించింది. గతేడాది ఆపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టీమ్ కుక్ అమ్‌స్టర్‌డ్యామ్ పర్యటన సందర్భంగా రిజిక్స్ మ్యూజియంను సందర్శించినప్పుడు 17వ శతాబ్దానికి చెందిన ఓ పెయింటింగ్‌లో చేతిలో ఐఫోన్ మాదిరి వస్తువును పట్టుకుని ఉన్న మహిళ ఫోటోను గమనించి వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పించోన్ పెయిటింగ్ లో కూడా స్మార్ట్ ఫోన్ ఆనవాళ్లు బయటపడటంతో కాల గమన సిద్ధాంతాన్ని కొందరు వెలుగులోకి తెస్తున్నారు. ఆ సమయంలో స్మార్ట్ ఫోన్లు ఉన్న మాట వాస్తవమేనని కొందరు వాదిస్తుండగా, మరికొందరు ఆ వాదనను కొట్టిపారేస్తుండగా, బహుశా అది అద్దం లాంటి వస్తువేదైనా అయి ఉంటుందని చెబుతున్నారు.


