సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో జాతీయ రహదారిపై బైక్ అదుపు తప్పిన ప్రమాదం కారణంగా ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
వివరాల ప్రకారం.. నారాయణఖేడ్ పట్టణ శివారులో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి 161బీ కల్వర్టు గుంతలో అదపు తప్పి బైక్ పడిపోయింది. దీంతో, బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, మృతులను నారాయణఖేడ్ మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతులను ఆవుటి నర్సింలు (27), జిన్న మల్లేష్ (24), జిన్న మహేష్ (23)గా తెలిపారు. కాగా, వీరు ముగ్గురు.. నారాయణఖేడ్ నుంచి నర్సాపూర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను నారాయణఖేడ్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.


