Jubilee Hills By Election Updates: 9గం.కు 9.2 శాతం.. కొనసాగుతున్న పోలింగ్‌ | Jubilee Hills By Election 2025 Polling Live Updates, Breaking News Headlines, Viral Photos And Videos | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

Jubilee Hills By Election Updates: 9గం.కు 9.2 శాతం.. కొనసాగుతున్న పోలింగ్‌

షేక్‌పేట్‌ డివిజన్‌లో ఉ‍ద్రిక్తత

  • పోలీసులతో కాంగ్రెస్‌ నేత సత్యనారాయణ వాగ్వాదం
  • బీఆర్‌ఎస్‌ ఏజెంట్లను బూత్‌లోకి పంపి తనను అడ్డుకున్నారంటూ ఆగ్రహం
  • సర్దిచెప్పిన పోలీసులు
     
2025-11-11 09:47:28

నెమ్మదిగా సాగుతున్న ఓటింగ్‌

  • నిదానంగా సాగుతున్న జూబ్లీహిల్స్‌ ఓటింగ్‌ ప్రక్రియ
  • మొదటి రెండు గంటల్లో 9.2 శాతం పోలింగ్‌
  • గడిచిన 2 గంటల్లో ఒక్కో పోలింగ్‌ సెంటర్‌లలో 100కు మించని ఓటర్లు
  • ఆఫీసులు, పనులకు వెళ్లేవాళ్లు ఓటేస్తున్న వైనం
  • సాయంత్రం వరకు టైం ఉండటంతో నిదానంగా సాగే అవకాశం
2025-11-11 09:26:38

రూల్స్ అతిక్రమిస్తున్న కాంగ్రెస్ నేతలు!

  • పోలింగ్ బూత్‌ల వద్ద సంచారిస్తున్న కాంగ్రెస్‌ నేతలు
  • ఓటు లేని వ్యక్తులు.. నియోజకవర్గం లో ఉండకూడదని ఎన్నికల నిబంధనలు
  • రహమత్ నగర్‌లో పర్యటిస్తున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ శంకర్ నాయక్
  • లైట్ తీసుకుంటున్న అధికారులు
2025-11-11 09:26:38

ప్రముఖుల ఓట్లు

  • జూబ్లీహిల్స్‌ పోలింగ్‌.. ఓటు హక్కు వినియోగించుకుంటున్న సినీ, రాజకీయ ప్రముఖులు
  • శ్రీనగర్ కాలనీలో ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి
  • వెంకటగిరి నాజర్‌ స్కూల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ డీజీపీ జితేందర్
2025-11-11 09:26:38

9గం. 9.2 శాతం పోలింగ్‌

  • జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు కొనసాగుతున్న పోలింగ్‌
  • 9గం. దాకా 9.2 శాతం పోలింగ్‌
  • సాయంత్రం 6 గంటల దాకా కొనసాగనున్న పోలింగ్‌
  • జూబ్లీహిల్స్‌ బరిలో 58 మంది అభ్యర్థులు
  • డ్రోన్‌లతో పోలింగ్‌ బూత్‌ల వద్ద పర్యవేక్షణ జరుపుతున్న అధికారులు
2025-11-11 09:18:09

బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌.. బోరబండ డివిజన్‌లో ఉద్రిక్తత

  • కొనసాగుతున్న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోలింగ్‌
  • బోరబండ డివిజన్‌లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకుల వాగ్వాదం
  • మాజీ డిప్యూటీ మేయర్‌ బాబా ఫసీయుద్దీన్‌, బీఆర్‌ఎస్‌ నేతల మధ్య తోపులాట
  • తమ కార్యకర్తలను బూత్‌ల వద్దకు వెళ్లనివ్వడం లేదని బీఆర్‌ఎస్‌ ఆరోపణ
  • కాంగ్రెస్‌ కార్యకర్తలు టీ షర్టులు వేసుకుని ప్రచారం చేస్తున్నారన్న మండిపాటు
  • అడ్డుకుని సర్దిచెప్పిన పోలీసులు
2025-11-11 09:18:09

జూబ్లీహిల్స్‌ పోలింగ్‌లో ఈవీఎంల మొరాయింపు

  • జూబ్లీహిల్స్‌  ఉప ఎన్నిక పోలింగ్‌లో మొరాయిస్తున్న ఈవీఎంలు
  • రిజర్వ్‌ ఈవీఎంలలోనూ సాంకేతిక సమస్యలు
  • క్యూ లైన్‌లలో వేచి చూస్తున్న ఓటర్లు
  • మొత్తం 11 చోట్ల ఈవీఎం ట్రబుల్స్‌
2025-11-11 08:28:25

కరెంట్‌ రావడంతో ప్రారంభమైన పోలింగ్‌

  • శ్రీనగర్‌ కాలనీ నాగార్జున కమ్యూనిటీ హాల్‌కు కరెంట్‌ కట్‌
  • చీకటితో ఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్‌
  • ఇప్పటికే క్యూ లైన్‌లో బారులు తీరిన ఓటర్లు
2025-11-11 08:28:25

షేక్‌పేట డివిజన్‌లో ఉద్రిక్తత

  • షేక్‌పేట డివిజన్‌లో ఉద్రిక్తత
  • పోలీసులతో కాంగ్రెస్‌ నేత సత్యనారాయణ వాగ్వాదం
  • బీఆర్‌ఎస్‌ ఏజెంట్లను బూత్‌లోకి పంపి తనను అడ్డుకున్నారని ఆగ్రహం
  • సత్యనారాయణకు సర్దిచెప్పిన పోలీసులు
2025-11-11 08:28:25

జూబ్లీహిల్స్‌ పోలింగ్‌, ఫస్ట్‌ టైం ఇలా..

  • ఎన్నికల్లో మొదటిసారి అమల్లోకి వచ్చిన వచ్చిన అంశాలు
  • మొదటిసారిగా ఈవీఎం లో అభ్యర్థుల కలర్ ఫోటో
  • మొదటిసారి డ్రోన్లతో సెక్యూరిటీ మానిటరింగ్ చేస్తున్న అధికారులు
  • ప్రతీ పోలింగ్ స్టేషన్ వద్ద మొబైల్ డిపాజిట్ సెంటర్ ఏర్పాటు
  • ప్రతీ పోలింగ్ స్టేషన్ వద్ద ఓటర్ అసిస్టెన్స్ బూత్ ఏర్పాటు
  • మొదటిసారి పోలింగ్ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పెంచిన అధికారులు
2025-11-11 08:28:25

పని చేయని రిజర్వ్‌ ఈవీఎం!

  • రెహమత్‌నగర్‌ పరిధిలో మొరాయించిన ఈవీఎంలు
  • రెహమత్ నగర్ డివిజన్ 165 డివిజన్ లో మొరాయించిన EVM
  • కొత్త EVM తెచ్చిన అధికారులు...అది సైతం పని చేయని వైనం
  • గంట నుంచి క్యూ లైన్‌లో ఓటర్లు
2025-11-11 08:16:03

ఓటు హక్కు వినియోగించుకున్న రాజమౌళి

  • జూబ్లీహిల్స్‌ ఎన్నికలో ఓటేసిన దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి
  • షేక్‌పేటలో ఓటు హక్కు వినియోగించుకున్న స్టార్‌ డైరెక్టర్‌
  • ఇంటర్నేషనల్ స్కూల్ బూత్ నెంబర్ 28లో ఓటేసిన జక్కన్న

 

2025-11-11 08:16:03

అంతా సెట్‌ చేశాం: డీఈవో ఆర్వీ కర్ణన్‌

  • ఎర్రగడ్డ పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్‌
  • ఏజెంట్లు ఐడీ కార్డులు వేసుకోకపోవడంపై అభ్యంతరం
  • ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి
  • షేక్‌పేటలో కూడా పోలింగ్‌ ప్రారంభమైంది
  • ఆరు పోలింగ్‌ కేంద్రాల్లో సమస్యలు తలెత్తాయి 
  • అంతా సెట్‌ చేశాం
  • గతంలో కంటే 40 పోలింగ్‌ కేంద్రాల సంఖ్యను పెంచాం
  • అంతా ఓటు హక్కు వినియోగించుకోవాలి

 

2025-11-11 08:16:03

షేక్‌పేటలో ప్రారంభమైన పోలింగ్‌

  • జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోలింగ్‌.. ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు
  • సరి చేస్తున్న అధికారులు
  • షేక్‌పేట డివిజన్‌ బూత్‌ నెంబర్‌ 30 వద్ద ఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్‌
2025-11-11 07:54:24

మొరాయిస్తున్న ఈవీఎంలు

  • జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక పోలింగ్‌లో భారీగా మొరాయిస్తున్న ఈవీఎంలు
  • ఎర్రగడ్డ, బోరబండ, షేక్‌పేట, వెంగళరావు నగర్‌ డివిజన్‌లలో ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు
  • పలుచోట్ల ఇంకా ప్రారంభం కాని ఓటర్లు
  • దాదాపు 11 చోట్ల ఈవీఎంలలో సమస్యలు
  • క్యూ లైన్‌లలో ఎదురు చూస్తున్న ఓటర్లు
  • ఈవీఎంలను పరిశీలిస్తున్న అధికారులు
  • పోలింగ్‌ బూత్‌లలో ఇబ్బంది పడుతున్న సిబ్బంది, ఓటర్లు
2025-11-11 07:39:56

ఒకే దగ్గర ఓటేయనున్న 10 వేల మంది

  • యూసఫ్‌గూడ గవర్నమెంట్‌ స్కూల్‌లో 10 పోలింగ్‌ సెంటర్లు
  • ఒకే దగ్గర ఓటేయనున్న 10 వేల మంది
  • షేక్‌పేట డివిజన్‌లో 70 వేల మంది ఓటర్లు
  • ఈ ఎన్నికతో తొలిసారి డ్రోన్‌ల వినియోగం
  • 139 పోలింగ్‌ సెంటర్‌లలో డ్రోన్‌ల ద్వారా మానిటరింగ్‌
2025-11-11 07:26:09

చీకట్లో పోలింగ్‌ సెంటర్‌

  • అంధకారంలో పోలింగ్‌ సెంటర్‌
  • శ్రీనగర్‌ కాలనీ నాగార్జున కమ్యూనిటీ హాల్‌కు కరెంట్‌ కట్‌
  • చీకట్లో పోలింగ్‌ సిబ్బంది
  • క్యూ లైన్‌లలో ఓటర్లు

 

2025-11-11 07:26:09

ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు

  • షేక్‌పేట డివిజన్‌లో ఇంకా ప్రారంభం కాని పోలింగ్‌
  • బూత్‌ నెంబర్‌ 30లో మొరాయించిన ఈవీఎంలు
  • రెహమత్‌నగర్‌లోనూ ఈవీఎంల మొరాయింపు
  • 165, 166 పోలింగ్‌ బూత్‌ల్లో సాంకేతిక సమస్యలతో ఆగిన ఓటింగ్‌
  • క్యూ లైన్‌లలో నిల్చున్న ఓటర్లు
  • వెంగళరావు నగర్‌లోనూ ఇదే సమస్య
  • ఈవీఎంలను పరిశీలిస్తున్న అధికారులు
2025-11-11 07:22:39

కీలకంగా మారనున్న పోలింగ్‌ శాతం

  • జూబ్లీహిల్స్‌లో కీలకంగా పోలింగ్‌ శాతం 
  • గత ఎన్నికల్లో ఎప్పుడూ 50 శాతం దాటని వైనం 
  • 2014లో 50.18%, 2018లో 45.59%, 2023లో 47.58% మాత్రమే ఓటింగ్‌ 
  • గత లోక్‌సభ ఎన్నికల్లో..  ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 2019లో 39.89%, 2024లో 45.59% ఓటింగ్‌
  • ఉపఎన్నిక కావడంతో పోలింగ్‌ శాతం పెరగొచ్చనే అంచనాలు
2025-11-11 07:14:06

ఓటేసిన మాగంటి సునీత

  • ఎల్లారెడ్డిగూడ పోలింగ్‌ కేంద్రంలో ఓటేసిన మాగంటి సునీత
  • జూబ్లీహిల్స్‌ బరిలో బీఆర్‌ఎస్‌ తరఫున మాగంటి గోపినాథ్‌ సతీమణి సునీత
  • ఉదయాన్నే కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న సునీత
  • ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు పిలుపు
2025-11-11 07:09:52

రెహమత్‌ నగర్‌లో 59 కేంద్రాలు

  • జూబ్లీహిల్స్ బై పోల్ పోలింగ్‌ ప్రారంభం
  • రెహమత్ నగర్ డివిజన్ లో ప్రారంభమైన పోలింగ్
  • రెహమత్ నగర్ లో 59 పోలింగ్ కేంద్రాలు
  • పోలింగ్ కేంద్రాల వద్ద వస్తున్న ఓటర్లు
2025-11-11 07:04:40

బోరబండ పోలింగ్‌ కేంద్రం వద్ద నిరసన

  • జూబ్లీహిల్స్ బోరబండలోని పోలింగ్ స్టేషన్ 314లో నిరసన
  • లైటింగ్ సరిగ్గా లేదంటూ ఏజెంట్లు, ఓటర్లు ఆగ్రహం
  • పోలింగ్‌ సిబ్బంది నుంచి సరైన స్పందన లేదంటూ ఆరోపణ
2025-11-11 07:04:40

ప్రారంభమైన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోలింగ్‌

  • ప్రారంభమైన జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక పోలింగ్‌
  • సాయంత్రం ఆరు దాకా కొనసాగనున్న పోలింగ్‌
  • పోలింగ్ కేంద్రాలకు ఒక్కొక్కరుగా చేరుకుంటున్న ఓటర్లు
  • అభ్యర్థులు ఎక్కువగా ఉండడంతో సమయం పొడిగించిన ఎన్నికల సంఘం
  • తొలిసారి డ్రోన్‌ల సాయంతో పోలింగ్‌ కేంద్రాల పర్యవేక్షణ

 

 

2025-11-11 07:01:36

జూబ్లీహిల్స్‌లో ఇప్పటిదాకా ఇలా..

  • 2009లో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం ఆవిర్భావం
  • తొలిసారిగా కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపు
  • తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లో మాగంటి గోపినాథ్‌ విక్టరీ
  • మాగంటి హఠాన్మరణంతో ఉప ఎన్నిక అనివార్యం
  • ఎవరు గెలుస్తారనేదానిపై సర్వత్రా ఉత్కంఠ

 

2025-11-11 06:59:01

జూబ్లీహిల్స్‌ ఓటర్లకు అలర్ట్‌

  • జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. కాసేపట్లో ప్రారంభం కానున్న పోలింగ్‌
  • ఉ.7గంటల నుంచి సా.6గంటల వరకు పోలింగ్‌
  • జూబ్లీహిల్స్‌లో మొత్తం 4,01,365 మంది ఓటర్లు
  • తీసుకెళ్లాల్సినవి.. ఓటర్‌ కార్డు లేకుంటే ఆధార్‌, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు..
  • పోలింగ్ స్లిప్.. కంపల్సరీ కాదు.
  • ఓటర్ల జాబితాలో పేరుంటేనే ఓటేసేందుకు వీలు
  • తీసుకెళ్లకూడనివి: మొబైల్ ఫోన్‌లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, పార్టీ గుర్తులు, ప్రచార వస్తువులు, ఆయుధాలు, పదునైన వస్తువులు
2025-11-11 06:59:01

నియోజకవర్గ ముఖచిత్రం

  • ఓటర్లు: 4.01 లక్షల మంది 
  • మొత్తం పోలింగ్‌ కేంద్రాలు: 407
  • సమస్యాత్మక కేంద్రాలు: 226
  • అభ్యర్థులు: 58 మంది
2025-11-11 06:59:01

ముగిసిన మాక్‌ పోలింగ్‌

  • జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ముగిసిన మాక్‌ పోలింగ్‌
  • మరికాసేపట్లో మొదలుకానున్న పోలింగ్‌
  • పోలింగ్‌ కేంద్రాలకు వడివడిగా చేరుకుంటున్న ఓటర్లు

 

2025-11-11 06:49:14

మరికాసేపట్లో పోలింగ్‌ ప్రారంభం

  • ఉప ఎన్నిక పోలింగ్‌ నేడే
  • ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు...
  • 58 మంది అభ్యర్థులు.. ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ 
  • ప్రత్యేక యాప్‌లో పోలింగ్‌ సరళి నమోదు
  • నాలుగు బ్యాలెట్‌ యూనిట్ల వినియోగం
2025-11-11 06:49:14
Advertisement
 
Advertisement
Advertisement