కంపెనీల్లో ఉద్యోగాల నియామకాల్లో హెచ్‌ఆర్ విభాగం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఇంత ముఖ్యమైన హెచ్‌ఆర్ పనివిధానంపై చాలా విమర్శలు కూడా చాలా కామన్. తాజాగా అలాంటి సోషల్ మీడియా పోస్ట్ ఒకటి చర్చనీయాంశమైంది. 14 ఏళ్ళ సర్వీసు తర్వాత కాస్ట్ కటింగ్‌లో భాగంగా తొలగించిన ఉద్యోగికి రిక్రూటర్ తిరిగి జాబ్ ఆఫర్ చేసిన ఘటన నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
ఖర్చులను తగ్గించుకునే పనిలో భాగంగా కంపెనీ ఒక వ్యక్తిని ఉద్యోగంలోంచి తీసేసింది. సరిగ్గా నాలుగు నెలల తర్వాత తిరిగి అదే ఉద్యోగం కోసం ఒక రిక్రూటర్ తనను నియమించుకోవడానికి ప్రయత్నించాడని ఆయన వెల్లడించాడు."ఒక రిక్రూటర్ నన్ను భర్తీ చేయడానికి ప్రయత్నించాడు" అనే శీర్షికతో ఒక రెడ్డిట్ పోస్ట్ వైరల్ అవుతోంది. 14 ఏళ్ల పాటు కంపెనీకి సేవలందించిన తనను ఈ ఏడాది ఏప్రిల్‌లో తొలగించారని వెల్లడించాడు.
ఇదీ చదవండి: 20 ఏళ్ల స్టార్‌డం వదిలేసి, 1200 కోట్ల వ్యాపార సామ్రాజ్యం
తక్కువ వేతనంతో ఆ స్థానాన్ని భర్తీ చేయలేకపోయారు. నాలుగు నెలలు పాటు వెదికి, చివరికి లింక్డ్ఇన్ ద్వారా తిరిగి రిక్రూటర్లలో ఒకరు తనను సంప్రదించారని తెలిపాడు. అలాగే మొత్తానికి తన లింక్డ్ఇన్ ప్రొఫైల్ చెక్ చేసి, తాను అప్పటికే ఆ కంపెనీలో పనిచేసిన విషయాన్ని గుర్తించాడు అని కూడా పేర్కొన్నాడు.
నెటిజన్ల స్పందన
అతని ఆఫర్‌ను అంగీకరించాలని మెజారిటీ సోషల్ మీడియా వినియోగదారులు కోరగా, తమకు ఇలానే జరిగింది అంటూ తమ అనుభవాలను పంచుకున్నారు. రిక్రూటర్లు అంతే.. అన్నారు ఇంకొంతమంది.అలాగే ఆఫర్‌ను ఓకేచేసి, ఇంటర్వ్యూకి వెళ్లాలి, అపుడు వాళ్ల ఎక్స్‌పెషన్స్ చూడాలి మజా వస్తుంది అని ఒకరు వ్యాఖ్యానించడం విశేషం.


