రూ.26 లక్షల ఆఫర్‌.. మేనేజర్‌ వల్ల బంగారంలాంటి ఛాన్స్‌ మిస్‌! | Man Loses Rs 26 Lakh Job Offer After Boss Verbally Promises | Sakshi
Sakshi News home page

మేనేజర్‌ను నమ్మితే ముంచేశాడుగా.. రూ.26 లక్షల ప్యాకేజీ మిస్‌!

Dec 26 2025 3:17 PM | Updated on Dec 26 2025 4:12 PM

Man Loses Rs 26 Lakh Job Offer After Boss Verbally Promises

ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు.. మరో జాబ్ ఆఫర్, మంచి శాలరీ ప్యాకేజీతో వస్తే ఎవరైనా వదులుకుంటారా? దాదాపు వదులుకోరు కదా!. అయితే.. ఓ వ్యక్తి మాత్రం తన మేనేజర్‌ మాటలు నమ్మి.. చివరకు మోసపోయాడు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

''తన విద్యార్థులలో ఒకరు, తన స్వస్థలానికి సమీపంలోని ఒక కంపెనీలో ఏడాదికి రూ. 15 లక్షల ప్యాకేజీతో పనిచేస్తున్నాడు. అతనికి వేరే చోట సంవత్సరానికి రూ. 26 లక్షల ప్యాకేజీతో ఆఫర్ వచ్చింది. ఈ జాబ్ కోసం.. చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేయనున్నట్లు మేనేజర్‌కు తెలిపారు. రాజీనామా విషయం చెప్పగానే.. ఇక్కడే ఉండండి, వచ్చే నెలలోనే మీకు.. మీరు పొందిన ఆఫర్‌కు తగిన హైక్ ఇస్తామని చెప్పారు. మేనేజర్‌ మాట విన్న ఉద్యోగి.. వేరే కంపెనీలో జాయిన్ అవ్వాలనే ఆలోచన మానుకున్నాడు. సరిగ్గా నెల రోజుల తరువాత.. మీటింగ్ జరిగింది. అప్పుడు జీతం పెంచము, రూ.15 లక్షల ప్యాకేజీనే కొనసాగుతుందని మేనేజర్‌ చెప్పినట్లు'' అమిత్ శేఖర్ అనే ఎక్స్ యూజర్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.

జరిగిన విషయాన్ని చెబుతూనే.. మాటలపై నమ్మకం ఉండదు. ఏదైనా డాక్యుమెంట్ రూపంలో ఉంటేనే మంచిదని అన్నారు. అయితే తాను తన.. విద్యార్థికి వచ్చిన ఆఫర్ మిస్ చేసుకోవద్దని చెప్పాను. అయితే ఉన్న కంపెనీ తన స్వస్థలానికి దగ్గరగా ఉందని, మేనేజర్ మాట ఇచ్చారని చెప్పారు.

ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తనదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. మంచి ఆఫర్ వచ్చినప్పుడు.. ఉన్న కంపెనీలోనే ఉండిపోదాం అనుకుంటే, మీ విలువ తగ్గిపోతుందని కొందరు చెప్పారు. ఇది చాలా బాధాకరమైన సంఘటన, ఇలా ఎవరికీ జరగకూడదని ఇంకొందరు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement