
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల పోలింగ్ నవంబర్ 11న జరగనుండగా ఇప్పటికే నామినేషన్ ప్రక్రియతో పాటు నామినేషన్ పత్రాల స్రూ్కట్నీ కూడా పూర్తయ్యింది. అభ్యర్థులు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ప్రచారంతో పాటు ర్యాలీలు, రోడ్‌షోలు, పోలింగ్, కౌంటింగ్ నిర్వహించేందుకు ఎన్నికల అధికారులతో పాటు పోలీసులు అలర్ట్ అయ్యారు.
ఈమేరకు అందరూ సమన్వయంగా ప్రణాళికలు రూపొందించి పకడ్బందీగా అమలుపరుస్తున్నారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ సెగ్మెంట్ పరిధి కిందికి వచ్చే టోలిచౌకి, గోల్కోండ, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, మధురానగర్, బోరబండ, పంజగుట్ట, సనత్‌నగర్ తదితర ఎనిమిది పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీషిటర్లను బైండోవర్ చేశారు. నేరాలను నియంత్రించడానికి, శాంతి భద్రతలకు విభాగం కలిగించే వ్యక్తులను అదుపులో ఉంచడానికి ఎన్నికల సమయంలో రౌడీషిటర్ల బైండోవర్ చేస్తుంటారు.
జూబ్లీహిల్స్ సెగ్మెంట్ పరిధిలోని ఈ ఎనిమిది పోలీస్‌స్టేషన్ల పరిధిలోని 100 మంది రౌడీషీటర్లతో పాటు 50 మంది సస్పెక్ట్ïÙట్లు కలిగి ఉన్నవారు ఉన్నారు. ఈ ప్రక్రియలో రౌడీషిటర్లు, అనుమానిత వ్యక్తులు శాంతి భద్రతల సమస్యలు సృష్టించకుండా ప్రవర్తన సరిదిద్దుకోవాలని, న్యాయస్థానం ముందు హామీపత్రంపై సంతకం చేయాలని పోలీసులు కోరతారు. ఒకవేళ బైండోవర్ అయిన తర్వాత ఈ హామీని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
- నేర కార్యకలాపాలను నివారించడం, సమాజంలో శాంతిభద్రతలను కాపాడడం, రౌడీషిటర్లు తమ ప్రవర్తన మార్చుకోవడానికి ప్రోత్సహించడం బైండోవర్ల ముఖ్య ఉద్దేశ్యం.
- జూబ్లీహిల్స్ సెగ్మెంట్‌లో ఉప ఎన్నిక సందర్భంగా ఇప్పటికే పోలీసులు అడుగడుడుగునా పికెటింగ్‌లు ఏర్పాటుచేయడంతో పాటు రాత్రిపూట పెట్రోలింగ్ ముమ్మరం చేసి అనుమానితుల కదలికలపై దృష్టిపెట్టారు. రౌడీషిటర్ల కదలికలను కూడా గమనిస్తున్నారు.
- ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో రౌడీషిటర్ల కదలికలపై దృష్టి పెట్టడమే కాకుండా వారు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారా..? అనే కోణంలో కూడా పరిశీలిస్తున్నారు. వీరందరికీ ఇప్పటికే కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు.
- ఎన్నికల కోడ్ వచి్చన మరుసటి రోజు నుంచే అన్ని పోలీస్‌స్టేషన్లకు చెందిన రౌడీషీటర్లను బైండోవర్ చేయడమే కాకుండా ఎన్నికలకు సంబంధించిన ర్యాలీలు, బహిరంగ సభలు, ప్రచారం తదితర కార్యక్రమాల్లో వీరు పాల్గొంటున్నారా..? లేకపోతే ఏదైనా సమస్యలు సృష్టించేందుకు ప్రయతి్నస్తున్నారా..? అన్నది పోలీసులు గమనిస్తున్నారు.
- జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధి కిందికి వచ్చే సోమాజీగూడ, షేక్‌పేట, యూసుఫ్‌గూడ, రహమత్‌నగర్, బోరబండ, వెంగళరావునగర్, ఎర్రగడ్డ తదితర ఏడు డివిజన్ల పరిధిలో 407 పోలింగ్ బూత్‌లను 139 లొకేషన్లలో ఏర్పాటుచేశారు.
- ఇందులో 57 పోలింగ్ లొకేషన్లను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు.
- క్రిటికల్ పోలింగ్ బూత్‌ల పరిధిలో ఉంటున్న రౌడీషీటర్ల కదలికలపై పోలీసులు ఎక్కువగా దృష్టిపెట్టారు.