హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటమి భయం కనిపిస్తుందని ఎద్దేవా చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్. ఈరోజు(శనివారం, నవంబర్ 8వ తేదీ) బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మాట్లాడిన లక్ష్మణ్.. సీఎం మాటల్ని బట్టే కాంగ్రెస్ ఓటమి భయం అర్థమవుతుందన్నారు.
సీఎం ఫ్రస్టేషన్‌లో బీజేపీపై నిందలు వేస్తూ ఫేక్ ప్రచారం చేస్తున్నారు. రేవంత్ ఈ ఎన్నికలకు ఎందుకు దడుసుకుంటున్నారు?, మీ వైఫల్యాలు తప్పించుకునేందుకు మాపై నిందాల?, ఇంటికొక్క ఉద్యోగం అంటూ....మీ మిత్రుడు బిహార్ లో హామీ ఇచ్చారు.
7 కోట్ల మంది ఉన్న బీహార్ లో ఇంటికొక ఉద్యోగం సాధ్యమేనా?, మీ జన్మదినం సందర్భంగా ప్రజలకు మీరిచ్చే గిఫ్ట్ ఏంటి?, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ చెట్టపట్టలు వేసుకొని అధికారాన్ని పంచుకున్నారు. 20 శాతం ఓట్ల కోసం ఇంకా దిగజారి మాట్లాడితే 80 శాతం ఉన్న ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం’ అని హెచ్చరించారు.


