హైదరాబాద్: ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రతీసారి ఎన్నికల అధికారులు రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇందులో భాగంగా కొన్ని పోలింగ్ బూత్‌ల వద్ద అధికారులు సెల్ఫీ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఓటు వేసిన అనంతరం ఈ బూత్‌లోకి వచ్చి ఫొటోలు దిగి స్టేటస్ పెట్టుకోవాలని అధికారులు సూచించారు. ఎర్రగడ్డలోని డాన్‌బాస్కో స్కూల్‌లో ఏర్పాటు చేసిన ఫొటో బూత్‌లో చాలా మంది ఓటర్లు ఫొటోలు దిగి స్టేటస్‌గా పెట్టుకున్నారు. దీని వల్ల ఓటు వేయని వారు చూసి స్ఫూర్తి పొంది ఓటు వేసేందుకు వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
చంటిబిడ్డతో వచ్చి..
బంజారాహిల్స్: శ్రీకృష్ణానగర్‌కు చెందిన కీర్తి తన 50 రోజుల చంటి బిడ్డతో వచ్చి కృష్ణానగర్‌లో ఓటు వేసింది. అదేవిధంగా ఇదే బస్తీకి చెందిన ఎనిమిది నెలలు దాటిన గర్భిణి రూప ఓటరు కేంద్రానికి భర్తతో వచ్చి ఓటు వినియోగించుకుంది. ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చిన వీరికి ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేసి వారికి త్వరగా ఓటు వేసే అవకాశం కలి్పంచారు.


